Lenin: ఇన్నావా.. ఇన్నావా.. కన్నెపిల్ల ఏమందో ఇన్నావా.. అయ్యగారి సాంగ్ అదిరింది

ABN , Publish Date - Jan 05 , 2026 | 07:42 PM

అఖిల్ అక్కినేని (Akhil Akkineni), భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) జంటగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లెనిన్ (Lenin).

Lenin

Lenin: అఖిల్ అక్కినేని (Akhil Akkineni), భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) జంటగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లెనిన్ (Lenin). మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫిర్చ్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొన్నటివరకు లెనిన్ కి సంబంధించిన ఒక్క అప్డేట్ కూడా కనిపించలేదు. అసలు ఈ సినిమా ఉందా అనే అనుమానం కూడా అభిమానుల్లో కలిగింది. కానీ, కొత్త ఏడాది నుంచి లెనిన్ నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ మేకర్స్ తాము కూడా ఉన్నామని క్లారిటీ ఇచ్చారు.

తాజాగా లెనిన్ నుంచి మొదటి సింగిల్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. వారెవా.. వారెవా అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అఖిల్, భాగ్యశ్రీ జంట చూడడానికి బాగానే కనిపిస్తుంది. ముఖ్యంగా లంగా ఓణీలో అచ్చ తెలుగు ఆడపిల్లలా ఎంతో అందంగా కనిపించింది. ప్రియుడికి మనసులోని మాటను చెప్పిన అమ్మాయి.. నేను చెప్పింది నీకు అర్దమయ్యిందా.. ? నా మనసులోని భావాలను నువ్వు విన్నావా.. ? అంటూ చెప్తున్నట్లు లిరిక్స్ ఉన్నాయి. ఇక థమన్ లవ్ సాంగ్స్ కు మ్యూజిక్ ఎలా వాయిస్తాడో అందరికీ తెల్సిందే. సాంగ్ మాత్రం చార్ట్ బస్టర్ అవుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇక అఖిల్ లుక్ మాత్రం ఎక్కడో తేడా కొట్టేలా ఉందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇప్పటివరకు ఇలాంటి లుక్ అఖిల్ ట్రై చేసింది లేదు. ఎంతో తెల్లగా ఉండే అయ్యగారిని పల్లెటూరు హీరోగా చేయడానికి ముఖానికి కొద్దిగా నలుపు రంగు పూసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆ హెయిర్ స్టైల్ కూడా అయ్యగారికి పెట్టినట్లు ఉంది. అది కూడా అంతగా అనిపించడమా లేదని చెప్పుకొస్తున్నారు. మొదట రిలీజ్ చేసిన గ్లింప్స్ లో అఖిల్ హెయిర్ స్టైల్ ఇలా లేదు. భాగ్యశ్రీతో రీషూట్ చేసినప్పుడు మార్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా పేరుకు తగ్గట్లు మే 1 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్ ప్రకటించారు. మరి ఈ సినిమాతోనైనా అయ్యగారు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Jan 05 , 2026 | 07:42 PM