కర్మయోగిని చూశా.. పవన్ కళ్యాణ్‌పై బాబీ పోస్ట్ వైరల్

ABN , Publish Date - Apr 08 , 2026 | 04:54 PM

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లో నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగిని చూశానంటూ.. డైరెక్టర్ బాబీ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్‌తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాను డైరెక్ట్ చేసిన బాబీ, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే ప్రాసెస్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Director Bobby and Pawan Kalyan

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ (Power Star Pawan Kalyan)లో నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగిని చూశానంటూ.. డైరెక్టర్ బాబీ (Director Bobby) చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్‌తో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాను డైరెక్ట్ చేసిన బాబీ, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో సినిమా చేసే ప్రాసెస్‌లో ఉన్నారు. ఆల్రెడీ చిరంజీవికి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాబీ, ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న రెండో మూవీ ప్రారంభం కానుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ఈ ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్న బాబీ.. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎంను కలిసినట్లుగా తెలుపుతూ, ఆయనతో ఉన్న ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు.


బాబీ తన పోస్ట్‌లో.. ‘‘ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం. ఆయనతో పనిచేసిన టైములో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను వెళ్ళేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషిలా కనిపించారు. రాజకీయాల్లో తమ ఆస్తుల్ని పెంచుకున్న వ్యక్తుల గురించి విన్నాం, చూశాం.. కానీ అన్ని సౌకర్యాలని వదులుకొని, నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుతున్న ఆయన నాకు ఒక శిఖరంలా కనిపించారు. అక్కడ ఉన్నంత సేపూ ఆయన నాపై చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయాను. చివరగా ఒక్క మాట చెబుతున్నాను. జ్ఞానం కోసం రాజభోగాలు వదిలేసి అడవుల బాట పట్టిన బుద్ధుడిని మనం చరిత్రలో చదువుకున్నాం. జనం కోసం తన సుఖాలన్నీ వదులుకొని నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగిని ఇవాళ చూశాను. జైహింద్. ఎప్పుడూ మీపై ప్రేమ ఇలానే ఉంటుంది సార్’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం బాబీ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.


ఇక ఈ పోస్ట్‌కు నెటిజన్ల రియాక్షన్ చాలా ఆసక్తికరంగా ఉంది. ‘అన్నా, కథ చెప్పావా? ఓకే అయ్యిందా?’, ‘మెగాస్టార్‌తో సినిమా చేసిన అనంతరం పవర్ స్టార్‌తో సినిమా చేస్తున్నావా?’, అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, అసలు బాబీ ఎందుకు పవన్ కళ్యాణ్‌ని కలిశారనేది మాత్రం తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

స‌డెన్‌గా న‌య‌న‌తార‌పై ట్రోలింగ్‌.. కార‌ణ‌మిదే!

సీజీఐ కంటెంట్‌ దిశగా గ్రీన్‌ గోల్డ్ యానిమేషన్‌

Updated Date - Apr 08 , 2026 | 04:54 PM