విజయ్ సేతుపతి జైత్రయాత్ర.. వరుస రిలీజ్‌లతో ఫుల్ బిజీ
ABN, Publish Date - Nov 10 , 2026 | 09:34 AM
‘బత్తా’ సినిమా ఘనవిజయంతో మంచి జోరుమీదున్న కోలీవుడ్ స్టార్ హీరో, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ఇకపై వెండితెరపై వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
‘బత్తా’ (Baththa) సినిమా ఘనవిజయంతో మంచి జోరుమీదున్న కోలీవుడ్ స్టార్ హీరో, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ఇకపై వెండితెరపై వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తోన్న క్రేజీ చిత్రాలు ఒక్కొక్కటిగా థియేట్రికల్ రిలీజ్‌కు ముస్తాబవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద కొన్నాళ్ల పాటు ఆయన హవా ఓ రేంజ్లో కొనసాగనుందనేది స్పష్టమవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
ముందుగా మిస్కిన్ దర్శకత్వంలో ఆయన నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘ట్రైన్’ (Train) చిత్రం రాబోయే డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఆ వెంటనే పొంగల్ కానుకగా జనవరి 14న త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వంలో వస్తున్న ‘పాకెట్ నావెల్’ (Pocket Novel) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా రెండు నెలల వ్యవధిలోనే రెండు విభిన్నమైన సినిమాలతో విజయ్ సేతుపతి బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారు.
మరోవైపు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం ‘స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్’ (Slumdog 33 Temple Road). ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ డీల్ రాబోయే కొద్ది రోజుల్లో పూర్తయితే, చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 2027లో థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
విజయ్ సేతుపతి వరుస రిలీజ్ డేట్లతో డైరీ పూర్తిగా ప్యాక్ అయిపోవడంతో, ఆయన నటిస్తున్న మరో చిత్రం ‘ఇంజి వెల్లం’ (Inji Vellam) విడుదలపై ప్రభావం పడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా, ఈ చిత్రాన్ని వేసవి కానుకగా 2027 ఏప్రిల్ నెలకు వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో విజయ్ సేతుపతి థియేటర్లలో సందడి చేస్తుండటం ఆయన అభిమానులకు నిజమైన పండుగని చెప్పవచ్చు. మరి ఈ సినిమాలతో కూడా ఆయన సక్సెస్ సాధించి.. మరోసారి తన రేంజ్ ఏంటో చూపిస్తారని ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
సినీ తారల ఇళ్లలో దీపావళి సందడి.. వర్షంలోనూ ఫ్యాన్స్ తగ్గేదేలే
చిరు లీక్స్లా లీక్స్ ఇవ్వను.. ‘కాకా’ సంక్రాంతికే: రామ్ చరణ్
జెన్ జీలో జోష్ నింపుతోన్న జానపదం.. దేనికి సంకేతం