సినీ తారల ఇళ్లలో దీపావళి సందడి.. వర్షంలోనూ ఫ్యాన్స్ తగ్గేదేలే

ABN , Publish Date - Nov 10 , 2026 | 08:42 AM

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్నంటగా, దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ తారల ఇళ్లలో పండుగ వాతావరణం మరింత శోభాయమానంగా వెల్లివిరిసింది.

Kollywood Diwali Celebrations

దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు (Diwali Celebrations) అంబరాన్నంటగా, దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ తారల ఇళ్లలో పండుగ వాతావరణం మరింత శోభాయమానంగా వెల్లివిరిసింది. ముఖ్యంగా కోలీవుడ్ సినీ ప్రముఖులు (Kollywood Cine Celebrities) తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులతో కలిసి దీపాల పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. తమ గృహాలను దీపాలతో అలంకరించి, ముంగిట బాణసంచా కాలుస్తూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఆదివారం జోరున వర్షం కురుస్తున్నప్పటికీ.. అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో, హీరోయిన్లను ప్రత్యక్షంగా చూసేందుకు వారి నివాసాల వద్దకు భారీగా తరలిరావడం విశేషం.


ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌ను చూసేందుకు వర్షాన్ని సైతం ఏమాత్రం లెక్కచేయకుండా వేలాది మంది అభిమానులు పోయెస్ గార్డెన్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అభిమానుల ఉత్సాహాన్ని చూసిన తలైవర్.. స్వయంగా ఇంటి బయటకు వచ్చి అందరికీ అభివాదం చేస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో అభిమానుల నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. మరోవైపు స్టార్ కపుల్ సూర్య - జ్యోతిక దంపతులు, లేడీ సూపర్ స్టార్ నయనతార - దర్శకుడు విఘ్నేశ్ శివన్ తమ పిల్లలతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకున్నారు.


అలాగే ప్రముఖ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తన భర్త, హీరో విష్ణు విశాల్‌, పిల్లలతో కలిసి పండుగ జరుపుకోగా.. నటి కీర్తి సురేష్ తన భర్తతో కలిసి దీపావళిని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకున్నారు. పూజా హెగ్డే తన స్నేహితులతో సందడి చేయగా.. తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్ హీరోయిన్లు సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోతూ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక దిగ్గజ దర్శకుడు మణిరత్నం - సుహాసిని దంపతుల నివాసంలో నిర్వహించిన దీపావళి వేడుకలు సినీ తారలతో కళకళలాడాయి. కోలీవుడ్‌కు చెందిన ఎంతో మంది ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

చిరు లీక్స్‌లా లీక్స్ ఇవ్వను.. ‘కాకా’ సంక్రాంతికే: రామ్ చరణ్

జెన్ జీలో జోష్ నింపుతోన్న జానపదం.. దేనికి సంకేతం

సుమయా రెండో చిత్రానికి అంతా సిద్ధం.. వివరాలివే

Updated Date - Nov 10 , 2026 | 08:42 AM

Rajinikanth - Mohan Babu: కోపాన్ని ఎందుకు వదల్లేకపోతున్నావ్‌..

Varanasi OTT: ఆ ఓటీటీకి రాజమౌళి షాక్.. వారణాసి కోసం కొత్త ప్లాన్!

Happy Journey OTT: ఓటీటీలోకి ‘హ్యాపీ జర్నీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నమ్రత, స్నేహారెడ్డిలతో కలిసి ఉపాసన దీవాళి సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్

మొన్న కృతి.. నేడు రకుల్.. పండగపూట ఆ బట్టలేంటి .. సిగ్గులేదా