VIjay Sethupathi: కూతురిగా చేసిన తరువాత ప్రియురాలుగా చేస్తే నటించలేను

ABN , First Publish Date - 2023-09-23T17:50:15+05:30 IST

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఇప్పుడు అన్నీ భాషల్లోనూ బాగా డిమాండ్ వున్న నటుడు. అయితే అతను సినిమాలో నటించడానికి కొన్ని పద్ధతులు కూడా పాటిస్తున్నారు. ఈమధ్యనే అతని పక్కన చెయ్యడానికి ఒక కథానాయికని తిరస్కరించాడు. దానికి కారణాలు కూడా చెప్పాడు, ఇంతకీ ఎవరా నటి...

VIjay Sethupathi: కూతురిగా చేసిన తరువాత ప్రియురాలుగా చేస్తే నటించలేను
Vijay Sethupathi

తమిళ నటుడు విజయ్ సేతుపతి (VIjaySethupathi) ఒక విలక్షణమైన నటుడు, ఇప్పుడు అన్ని భాషల్లోనూ అతను డిమాండ్ బాగా వుంది. ఈమధ్యనే షారుఖ్ ఖాన్ (ShahRukhKHan) నటించిన 'జవాన్' #Jawan సినిమాలో ప్రతినాయకుడి పాత్ర వేసి మెప్పించాడు. దీనికి అట్లీ (Atlee) దర్శకుడు కాగా, ఇందులో నయనతార (Nayanthara), దీపికా పడుకోన్ (DeepikaPadukone) కథానాయకులుగా వేశారు. ఈ సినిమా ఇప్పుడు వెయ్యికోట్ల క్లబ్ లో చేరటానికి కొంచెం దూరంలో వుంది.

ఇదిలా ఉంటే, విజయ్ సేతుపతి 'ఉప్పెన' #Uppena తెలుగు సినిమాలో చేసాడు. అది చాలా పెద్ద హిట్ అయింది. సానా బుచ్చిబాబు (SanaBuchibabu) దర్శకుడిగా మొదటి సినిమా అది, అలాగే అందులో జంటగా వేసిన కృతి శెట్టి (KrithiShetty), వైష్ణవ తేజ్ (VaishnavTej) లకు కూడా అది మొదటి సినిమా. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. అలాగే ఈ సినిమాకి జాతీయ అవార్డు కూడా దక్కింది.

vijaysethupathi-jawan.jpg

ఇదిలా ఉండగా, విజయ్ సేతుపతి ఒక తమిళ సినిమా వొప్పుకున్నప్పుడు అందులో కథానాయకురాలిగా చెయ్యడానికి ఆ చిత్ర నిర్వాహకులు విజయ్ సేతుపతికి కృతి శెట్టి ఫోటో చూపించారట. వెంటనే వద్దు అని ఆమెని తిరస్కరించాడట విజయ్. ఎందుకంటే ఆమె మొదటి సినిమాలో ఆమె నాకు కూతురిగా వేసింది, ఇప్పుడు ఆమెకి నేను ప్రియుడిగా నటించమంటే నేను నటించలేను అని చెప్పేశాడట. దటీజ్ విజయ్ సేతుపతి అని అందరూ మెచ్చుకుంటున్నారు.

krithishetty4.jpg

కానీ మరి కృతి శెట్టి కి మాత్రం ఒక పెద్ద సినిమా వదిలేసుకున్నట్టు అయింది. ఎందుకంటే ఎప్పుడైతే విజయ్ సేతుపతి వద్దన్నాడో ఆమెకి ఆ సినిమా పోయినట్టే! ఆమె ఎప్పుడూ విజయ్ సేతుపతి పక్కన ఇక ప్రియురాలిగా నటించలేకపోవచ్చు అని అంటున్నారు. విజయ్ సేతుపతి ఇప్పుడు 'మెర్రి క్రిస్మస్', 'గాంధీ టాకీస్' అనే సినిమాలు చేస్తున్నాడు.

Updated Date - 2023-09-23T17:52:04+05:30 IST