చిరు లీక్స్‌లా లీక్స్ ఇవ్వను.. ‘కాకా’ సంక్రాంతికే: రామ్ చరణ్
ABN , Publish Date - Nov 09 , 2026 | 11:10 PM
కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, అనశ్వర రాజన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ చరణ్ స్పీచ్ హైలెట్ అవుతోంది.
కింగ్ నాగార్జున (King Nagarjuna) సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’ (Itllu Arjuna). అనీష్ (Aniesh) హీరోగా పరిచయం అవుతుండగా, అనశ్వర రాజన్ (AnaswaraRajan) హీరోయిన్‌గా నటిస్తున్నారు. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన కొత్తగా ప్రారంభించిన వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలను పెంచగా.. నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక చిత్ర ప్రమోషన్స్‌ని కొన్ని రోజులుగా ఓ రేంజ్‌లో మేకర్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ పేరుతో థమన్ మ్యూజికల్ కాన్సర్ట్‌ని నిర్వహించారు. కింగ్ నాగార్జున, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ముఖ్య అతిథులుగా ఈ వేడుకకు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘‘అనీష్ హీరోగా లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. తన తల్లిదండ్రులకు ఈ సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను. తనకు మరో పెద్ద సపోర్ట్ కింగ్ నాగార్జున గారు. ఆయన సపోర్ట్‌తో కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ రెడీ అవుతుందని తెలుసు. ఎప్పుడూ కొత్త టాలెంట్‌ను పరిచయం చేస్తూ, ప్రోత్సహించడంలో ఆయన ముందుంటారు. ఈ విషయంలో ఆయనను బీట్ చేసే వారే లేరు. ఇప్పుడు అనీష్‌ను కూడా ఎంకరేజ్ చేయడం ఆనందంగా వుంది. అలాగే ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్న వెంకీకి, డైరెక్టర్ మహేష్‌కి ఆల్ ది బెస్ట్. అనశ్వర చాలా అద్భుతమైన నటి. ‘కాకా’ సినిమాలో కూడా తను చాలా ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. ఈ నెల 13న ‘ఇట్లు అర్జున’తో, ఆ వెంటనే సంక్రాంతికి ‘కాకా’తో మరో బ్లాక్‌బస్టర్ ఆమెకు రాబోతోంది.
నాన్నగారి ‘కాకా’ సినిమాలో ఆమె అద్భుతమైన పాత్ర చేశారు. ఆ సినిమాలో ఆమెకు, నాన్నగారికి ఉన్న రిలేషన్ గురించి నేనేం చిరు లీక్స్‌లా లీక్స్ ఇవ్వడం లేదు. చాలా కీలకమైన పాత్ర ఆమె అందులో చేశారు. వరసగా రెండు బ్లాక్‌బస్టర్స్ ఆమెకు రాబోతున్నాయి.. ఇది రాసి పెట్టుకోండి. తమన్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ బాబాయ్ ‘ఓజీ’ సినిమాకైనా, అనిష్ ‘ఇట్లు అర్జున’కైనా సమానంగా మ్యూజిక్ చేస్తారు. తన మ్యూజిక్‌తో లక్షల మందిని కనెక్ట్ చేస్తాడు. అది పెద్ద హీరోనా, చిన్న హీరోనా అనే తేడా తనకి ఉండదు. అందరికీ అద్భుతమైన మ్యూజిక్ ఇస్తాడు. ఇందులో పాటలన్నీ చాలా బాగున్నాయి.

సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా.. అనీష్‌కి సినిమా అంటే చాలా ఫ్యాషన్ ఉంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు నాకు చూపించాడు. నేను నా ఫస్ట్ సినిమాకు ఎలా చేశానో తెలియదు కానీ, నాకంటే 10 రెట్లు బెటర్‌గా చేశాడు. తన ప్రతి సీన్‌ను చాలా అద్భుతంగా చేశాడు. ఆ సీన్స్ చూసి ఎలా ఇలా చేశావ్ అని అడిగాను. తనకు కచ్చితంగా చాలా పెద్ద ఫ్యూచర్ ఉంటుంది. మూగవాడిగా నటించినప్పటికీ అన్ని నవరసాలను పలికించాడు. ప్యూర్ యాక్టింగ్ ఉంటే తప్ప అంత అద్భుతంగా చేయలేరు. నేను కూడా ‘రంగస్థలం’ సినిమాలో చెవిటివాడిగా నటించాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంతకంటే పెద్ద విజయం ఈ సినిమాతో అనీష్‌కు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా తన భవిష్యత్ విజయాలకు మంచి పునాది కావాలి ఆశిస్తున్నాను..’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
జెన్ జీలో జోష్ నింపుతోన్న జానపదం.. దేనికి సంకేతం
సుమయా రెండో చిత్రానికి అంతా సిద్ధం.. వివరాలివే
సూర్య ‘సీన్’ 3 డేస్ కలెక్షన్స్.. హ్యాట్రిక్ కొట్టినట్టే