Vijay Sethupathi : విజయ్ సేతుపతి నట విశ్వరూపం చూస్తారు
ABN , Publish Date - Jun 11 , 2024 | 05:07 AM
తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం ‘మహరాజా’. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దా్‌స, అభిరామి కీలక పాత్రలు పోషించారు. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో సుధన్ సుందరమ్,

తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం ‘మహరాజా’. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దా్‌స, అభిరామి కీలక పాత్రలు పోషించారు. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో సుధన్ సుందరమ్, జగదీశ్ పళనిసామి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలవుతోంది. సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా విజయంపై అంతా నమ్మకంగా ఉన్నాం. తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అని చెప్పారు. ‘‘మాస్, క్లాస్ ప్రేక్షకుల్ని అలరించే ఫ్యామిలీ ఎంటర్టైరనర్ ‘మహరాజా’. విజయ్ సేతుపతి నటవిశ్వరూపం ఇందులో చూస్తారు’’ అని నిర్మాత ఎన్వీ ప్రసాద్ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్: ఫిలోమిన్ రాజ్, డీ ఓపీ: దినేశ్ పురుషోత్తమన్, సంగీతం: బి.అజనీశ్ లోక్‌నాథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎ.కుమార్.