సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jailer 2: సంతానం సీన్లన్నీ ఔట్.. విజయ్ సేతుపతి పాత్ర ‘జైలర్ 3’కి లీడ్..

ABN, Publish Date - Oct 14 , 2026 | 05:18 PM

‘జైలర్ 2’ పై దేశవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇటీవల విడుదలైన ‘జైలర్ 2 సూపర్ షో’లో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ ఇద్దరూ కాలేజీ ఫ్రెండ్స్‌లా ఒకరిపై ఒకరు సరదాగా జోకులు వేసుకుంటూ సందడి చేసిన విషయం తెలిసిందే.

Jailer 2 Movie Update

సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth), డార్క్ కామెడీ కింగ్ నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dileep Kumar) కలయికలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన సంచలన చిత్రం ‘జైలర్’ (Jailer). ఇప్పుడు ఈ ఇండస్ట్రీ హిట్ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ (Jailer 2)పై దేశవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇటీవల విడుదలైన ‘జైలర్ 2 సూపర్ షో’లో రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ ఇద్దరూ కాలేజీ ఫ్రెండ్స్‌లా ఒకరిపై ఒకరు సరదాగా జోకులు వేసుకుంటూ సందడి చేసిన తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే, ఈ భారీ సీక్వెల్‌కు సంబంధించి ఎడిటింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన ఓ తాజా అప్‌డేట్ ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాలో భారీ తారాగణం ఉండటంతో షూటింగ్ పూర్తయ్యేసరికి ఫైనల్ రఫ్ కట్ ఏకంగా 3 గంటల 20 నిమిషాల నిడివితో వచ్చిందట. ఇంత రన్‌టైమ్ ఉంటే థియేటర్లలో ప్రేక్షకులకు సాగదీతగా అనిపించే ప్రమాదం ఉందని భావించిన దర్శకుడు నెల్సన్.. సినిమాను క్రిస్ప్‌గా 2 గంటల 45 నిమిషాలకు కుదించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో దాదాపు 35 నిమిషాల ఫుటేజీకి ఎడిటింగ్‌లో కత్తెర వేయాల్సి వచ్చిందట.


చాలా కాలం తర్వాత రజనీకాంత్ సినిమాలో స్టార్ కమెడియన్ సంతానం (Santhanam) ఓ అదిరిపోయే కామెడీ కామియో రోల్ చేశారు. షూటింగ్ సమయంలో ఈ సన్నివేశాలు ఎంతో సరదాగా వచ్చినా, కథా గమనానికి ఆటంకం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో సంతానం చేసిన పూర్తి కామెడీ ఎపిసోడ్‌ను ఎడిటింగ్‌లో తొలగించినట్లు సమాచారం. ఇది సంతానం అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయమే అయినా, సినిమా పేస్ దెబ్బతినకూడదనే మేకర్స్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారట. అలాగే స్టార్ యాక్టర్ ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో ఓ కీలకమైన కామియో పాత్రలో నటించారు. అయితే రన్‌టైమ్ పరిమితుల దృష్ట్యా ఆయన సన్నివేశాలకు కూడా భారీగా కత్తెర పడిందని తెలుస్తోంది. కేవలం క్లైమాక్స్ చివర్లో వచ్చే ఒక నిమిషం షాట్‌ను మాత్రమే సినిమాలో ఉంచినట్లు తెలుస్తోంది.


అయితే ఇక్కడే నెల్సన్ ఓ అదిరిపోయే మాస్టర్ ప్లాన్ వేశారట. ఆ ఒక్క నిమిషం విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ఎపిసోడ్‌నే రాబోయే ‘జైలర్ 3’ ప్రాజెక్ట్‌కు ప్రధాన లీడ్ ఎండింగ్‌గా మార్చారట. ఆ ఒక్క నిమిషం సీన్ థియేటర్లలో రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుందని, ‘జైలర్ 3’ పై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్తుందని ఇండస్ట్రీ టాక్. నిడివి ఎక్కువైతే ఎంతటి స్టార్ల సీన్లనైనా కట్ చేయడానికి వెనుకాడని నెల్సన్.. ‘జైలర్ 2’ను పరుగులు పెట్టించే స్క్రీన్‌ప్లేతో సిద్ధం చేశారని అర్థమవుతోంది. మరి రజనీ-నెల్సన్ ద్వయం ఈసారి వెండితెరపై ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో ఇంకొన్ని గంటల్లో తెలిసిపోనుంది.

ఇవి కూడా చదవండి:

సెట్‌లో ప్రమాదం.. ఇమ్రాన్ హష్మీకి తప్పిన ప్రాణాపాయం

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాల విడుదల వాయిదా

RC17: కొత్త ఆఫీస్ పూజా కార్యక్రమాలు పూర్తి

Updated Date - Oct 14 , 2026 | 05:18 PM