Jailer 2: గుండెల్నే పరిపాలించే ప్రేమికుడేలే.. అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చిపడేశాడు
ABN , Publish Date - Sep 25 , 2026 | 07:51 PM
సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ జైలర్ 2. బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు నెలకొల్పిన జైలర్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ జైలర్ 2 (Jailer 2). బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు నెలకొల్పిన జైలర్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో సూరజ్, ఎస్ జె సూర్య, విద్యాబాలన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమా నుంచి వన్ సన్ వన్ మూన్అనే సెకండ్ సింగిల్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేసింది. ఈ పాటకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ తనదైన హై-వోల్టేజ్ మాస్ సంగీతాన్ని సమకూర్చడమే కాకుండా పాటను ఎంతో శక్తివంతంగా ఆలపించాడు. రజనీకాంత్ ఐకానిక్ ఇమేజ్‌ని, ఆయనకున్న అసాధారణమైన మాస్ ఫాలోయింగ్‌ని ఎలివేట్ చేసేలా ఈ పాటలోని బీట్స్, లిరిక్స్ కుదిరాయి. బాస్కరభట్ల అందించిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. గుండెల్నే పరిపాలించే ప్రేమికుడేలే..మన దిక్కు మొక్కై పోడా కావాలంటే అనే లైన్ అభిమానుల గురించి రాసినట్లు అనిపిస్తుంది. అనిరుధ్ అందించిన మాస్ మ్యూజిక్, రజనీకాంత్ బాడీ లాంగ్వేజ్‌కు అభిమానులు, సంగీత ప్రియులు బ్రహ్మరథం పడుతున్నారు.
జైలర్ లో వచ్చిన హుకుం సాంగ్ మాస్ మ్యూజిక్ తో అదరగొట్టగా.. ఈ సాంగ్ చాలా క్లాస్ గా ఉంది. ఈ పాటతో జైలర్ 2 ప్రమోషన్స్ సరికొత్త ఊపుని అందుకోగా, సినిమాపై ఉన్న క్రేజ్‌ను ఈ సాంగ్ మరింత పెంచేసింది. ప్రస్తుతం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 15 న రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో రజనీ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.