Jailer 2: జైల‌ర్ 2 ప్ర‌తినాయ‌కుడిగా నాగార్జున‌?.. పోలీసాఫీస‌ర్‌గా బాలయ్య!

ABN , Publish Date - May 28 , 2025 | 07:37 AM

ఏడాదిన్న‌ర క్రితం జైల‌ర్ సినిమాతో త‌మిళ‌నాట స‌రికొత్త‌ రికార్డులు తిర‌గ‌రాసిన ర‌జ‌నీకాంత్ ఇప్పుడు జైల‌ర్‌2 చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో న‌టించ‌బోయే తార‌ల పేర్లు టోట‌ల్ సినిమా ఇండ‌స్ట్రీల‌ను షేక్ చేస్తున్నాయి.

jailer2

ఏడాదిన్న‌ర క్రితం జైల‌ర్ సినిమాతో త‌మిళ‌నాట స‌రికొత్త‌ రికార్డులు తిర‌గ‌రాసిన ర‌జ‌నీకాంత్ (Rajinikanth) గ‌తేడాది వేట్ట‌యాన్ సినిమాతో ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే. ఈయేడు యువ సంచ‌ల‌నం లోకేశ్ క‌న‌క‌రాజ్ తో చేస్తున్న కూలీ షూటింగ్ పూర్తి చేసుకోగా ఆగ‌ష్టులో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మైంది. ఇదిలాఉండ‌గా.. జైల‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు నెల్స‌న్ (Nelson Dilipkumar) తో ప్ర‌స్తుతం జైల‌ర్‌2 (Jailer 2) చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే కూలీ సినిమాలో నాగార్జున, ఉపేంద్ర‌, అమీర్‌ఖాన్‌, షౌబిన్ షాహిర్‌, శృతిహాస‌న్ వంటి అగ్ర తార‌లు న‌టిస్తుండ‌డంతో ఇప్పుడీ చిత్రం టాక్ ఆఫ్ ది ఇండియాగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే ర‌జ‌నీ త‌ర్వాతి సినిమా విష‌యంలోనూ అలాంటి వార్త‌లు మ‌రోసారి వినిపిస్తూ సినిమా ఇండ‌స్ట్రీల‌ను షేక్ చేస్తున్నాయి.

‘జైలర్‌’ సినిమాతో రజనీకాంత్‌ అభిమానులనే కాకుండా తమిళ, తెలుగు అన్ని వ‌ర్గాల‌ ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకొన్న దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌ దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్‌ 2’ పై ఉన్న భారీ అంచనాలను దృష్టిలో ఉంచుకొని మరింత ఆసక్తికరంగా రూపొందిస్తున్నారు. రజనీకాంత్‌ ఇందులో వపర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ చేస్తుండగా, ఈ సినిమాలో ఆయనతో తలపడే విలన్‌గా నాగార్జున నటించనున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ‘కూలీ’ చిత్రంలో వీరిద్దరూ పోటాపోటీగా ఉండే పాత్రలను పోషిస్తున్నారు.

జైల‌ర్‌2 (Jailer 2) లో విలన్‌ పాత్ర కోసం కొన్ని పేర్లు పరిశీలించినా, చివరకు ‘కూలీ’ చిత్రంలో సైమన్‌గా నాగార్జున లుక్‌, పెర్ఫార్మెన్స్‌ చూసి దర్శకుడు నెల్సన్‌ తన సినిమాకు ఆయనే విలన్‌ అని ఫిక్స్‌ అయ్యారట. వెంటనే నాగార్జునను కలవ‌డం, కథ, పాత్ర నచ్చడంతో నాగార్జున సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారని తెలుస్తోంది. ‘జైలర్‌ 2’ చిత్రానికి సంబంధించి ఇప్పటికి రెండు షెడ్యూల్స్‌ పూర్తవ‌గా... మూడో షెడ్యూల్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులోనే రజనీకాంత్ (Rajinikanth), నాగార్జున (Nagarjuna) పాల్గొనే భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌లు చిత్రీకరించాలని దర్శకుడు నెల్సన్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

Gr9f0jhXgAAleE6.jpg


ఇదిలాఉంటే.. ‘జైలర్‌ 2’లో నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య కనిపించనున్నట్లు కొంత‌కాలంగా మీడియా వ‌ర్గాల్లో బాగా వినిపిస్తున్నాయి. ఈమేర‌కు స్టోరి డిస్క‌ర్ష‌న్ కూడా జ‌రిగిపోయింద‌ని, భారీ అమౌంట్ కోట్ చేసిన‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే జైల‌ర్‌లోనే శివ‌రాజ్ కుమార్ పాత్ర‌లో బాల‌య్య న‌టించాల్సి ఉన్న‌ప్ప‌టికీ మిస్ అయింద‌ని నెల్స‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో సైతం చెప్పడం విధిత‌మే. కాగా ఇప్పుడు ఈ సినిమాలో అవ‌కాశం ఉండ‌డంతో బాల‌కృష్ణ‌ను ప్ర‌త్యేక ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌కు ఫైన‌ల్ చేసిన‌ట్లు చెబుతున్నారు.

ఇదిలాఉంటే టాలీవుడ్ ఆగ్ర‌ తార‌లైన‌ బాలకృష్ణ, నాగార్జునలు ఇంతవరకూ ఒక్క సినిమాలో కూడా కలసి నటించని క్ర‌మంలో మ‌రి ఈ సినిమాలో కలసి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తారా, లేక వారిద్దరికీ విడివిడిగా సన్నివేశాలు ఉంటాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.వీరి రాక‌తో టాలీవుడ్‌లో, బాలీవుడ్‌లోనూ బిజినెస్ కూడా అదే స్థాయిలో పెరుగుతుంవ‌ని భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాపై అంచ‌నాలకు ఆకాశ‌మే హ‌త్తుగా మారిపోయింది. మ‌రి కొద్ది రోజులైతే గానీ ఈ జైల‌ర్‌2 (Jailer 2) చిత్రం గురించి పూర్తి విష‌యాలు బ‌య‌ట‌కు రావు. అప్ప‌టి వ‌ర‌కు అతా వేచి చూడాల్సిందే.

Updated Date - May 28 , 2025 | 07:37 AM