Jailer 2: సూరజ్, సూర్య, విద్యాబాలన్.. ఎంతమందిని దింపుతావయ్యా నెల్సన్

ABN , Publish Date - Sep 20 , 2026 | 09:09 PM

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ జైలర్ 2 (Jailer 2). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్తోంది.

Jailer 2

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ జైలర్ 2 (Jailer 2). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్తోంది. మొదటి భాగం సృష్టించిన ప్రభంజనం తర్వాత, సీక్వెల్ కోసం నెల్సన్ ప్లాన్ చేస్తున్న కాస్టింగ్, క్యారెక్టర్ డెజైన్ చూసి సినీ ప్రియులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మొదటినుంచి జైలర్ ని మించి జైలర్ 2 ఉండబోతుందని మేకర్స్ చెప్తూనే వచ్చారు. జైలర్ లో కూడా స్టార్ క్యాస్టింగ్ తక్కువ లేదు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీష్రాఫ్ క్యామియోలుగా కనిపించారు. ఇక ఇప్పుడు జైలర్ 2 లో అంతకుమించిన క్యాస్టింగ్ ప్లాన్ చేశాడు నెల్సన్.


సౌత్, నార్త్ ఇండస్ట్రీల నుంచి విలక్షణ నటులను ఎంచుకుంటూ, ప్రతి పాత్రకూ ఒక ప్రత్యేకమైన మాస్ ఎలివేషన్ ఇచ్చే నెల్సన్ మార్క్ మేకింగ్ జైలర్ 2లో మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఇప్పటికే మలయాళ స్టార్ నటుడు సూరజ్ వెంజరమూడు.. దిలీప్ అనే పాత్రలో నటిస్తుండగా, ఎస్.జే.సూర్య బోధి అనే నెగెటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు. వీరిద్దరి లుక్స్ లో చూపించిన ఇంటెన్సిటీ, రజనీకాంత్- ఎస్.జే.సూర్య మధ్య వచ్చే ఫేస్-ఆఫ్ సీన్స్ థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. దీనికి తోడు మరో పవర్‌ఫుల్ లేడీ క్యారెక్టర్‌లో విద్యాబాలన్ తోడవ్వడం ఈ సీక్వెల్‌కు పాన్-ఇండియా రేంజ్‌లో అపారమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. కాంత అనే పాత్రలో ఆమె నటించబోతున్నట్లు మేకర్స్ తాజాగా ఒక వీడియోని రిలీజ్ చేశారు. చీరకట్టులో స్టైలిష్ గా సిగరెట్ తాగుతూ విద్యాబాలన్ కనిపించింది.


ఇక ఈ ఒక్కొక్కరి నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్‌కు తిరుగులేకపోవడంతో నెల్సన్ ఎంతమంది నటులను దింపినా ప్రతీ పాత్రకు సరైన జస్టిస్ చేస్తాడనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని సర్ప్రైజ్‌లు రావడం ఖాయమనిపిస్తోంది. ఇక ఈ క్యాస్టింగ్ చూసి అభిమానులు ఇంకెంతమందిని దింపుతావ్ నెల్సన్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్‌కి నెల్సన్ మార్క్ డార్క్ కామిక్-యాక్షన్ జోడించి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద మరోసారి రికార్డుల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Updated Date - Sep 20 , 2026 | 09:09 PM