Karuppu: సూర్య సినిమా మార్నింగ్ షోలు రద్దు.. ఈ రోజు విడుదల డౌటేనా!
ABN, Publish Date - May 14 , 2026 | 11:57 AM
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు ఇంకా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆయన హీరోగా నటించిన ‘కరుప్పు’ చిత్రం గురువారం రిలీజ్ కావాల్సి ఉండగా, అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని మార్నింగ్ షోలు రద్దయ్యాయి.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya)కు ఇంకా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆయనకు హిట్ పడి చాలా కాలం అవుతుంది. ఆయన సినిమా వస్తున్న ప్రతిసారి, ఈసారి కచ్చితంగా హిట్ వస్తుందని అభిమానులు ఆశపడటం, తీరా విడుదలైన తర్వాత నిరాశ పడటం అనేది గతకొంతకాలంగా జరుగుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అటు సూర్యకు, ఇటు ఆయన అభిమానులకు ఉన్న హోప్ ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు). కానీ, ఈ సినిమాకు కూడా కష్టాలు కొనసాగుతున్నాయి. మే 14న గ్రాండ్‌గా రిలీజ్ కావాల్సిన ‘కరుప్పు’, అనూహ్య పరిణామాలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే విడుదల కావాల్సిన అన్ని చోట్ల మార్నింగ్ షోలు రద్దయ్యాయి. అన్నీ సెట్ అయితే.. మే 14 సాయంత్రం ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందనేలా కోలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది.
సూర్య ‘కరుప్పు’ (Karuppu) కష్టాలకు కారణం.. నిర్మాణ సంస్థ పాత బకాయిలే అని తెలుస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.ఈ సంస్థ, గతంలో చేసిన సినిమాలకు సంబంధించి దాదాపు రూ. 30 నుంచి రూ. 40 కోట్ల వరకు క్లియరెన్స్ చేయాల్సి ఉందని, అందుకే సినిమా విడుదల ఆగిపోయిందనేలా టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ అప్పుల విషయమై చర్చలు నడుస్తున్నాయని, సాయంత్రంలోపు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కోలీవుడ్ మీడియా తెలియజేస్తోంది. చర్చలు కనుక సఫలం కాకపోతే.. ‘కరుప్పు’ విడుదల డౌటే అనేలా కూడా టాక్ వినబడుతోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో..?
మరోవైపు ఈ సినిమా విడుదల నిమిత్తం తమిళనాడులో స్పెషల్ షోలకు కూడా అనుమతి వచ్చింది. కానీ, సినిమా విడుదల కాలేదు. దీంతో షోలను రద్దు చేసి, టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తున్నారు. దీంతో మరోసారి సూర్య ఫ్యాన్స్‌కు నిరాశ తప్పలేదు. ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. కచ్చితంగా సూర్యకు హిట్ పడుతుందని అభిమానులు ఎంతో ఆశతో ఉన్నారు. అనూహ్యంగా ఇలాంటి పరిణామాలు ఏర్పడటంతో.. వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదల అని తెలిసి, ఇలాంటివి క్లియర్ చేసుకోవాలి కదా.. అంటూ నిర్మాణ సంస్థపై ఫైర్ అవుతున్నారు. సూర్య సరసన త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం.. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది.
ఇవి కూడా చదవండి:
పరిష్కారం కోసమా? పరువు తీసుకోవడానికా?.. ఇండస్ట్రీ రచ్చపై మధుర శ్రీధర్
అప్పుడు ‘హరి హర వీరమల్లు’కి.. ఇప్పుడు ‘పెద్ది’కి! - మైత్రీ రవిశంకర్
Prabhas: ‘బాహుబలి’ ప్రభాస్ చేసిన ఈ పని తెలిస్తే.. ఫ్యాన్ అయిపోవాల్సిందే!
రాజీనామా.. నట్టి కుమార్ సంచలన నిర్ణయం