VeeraBhadrudu: సూర్య ‘వీరభద్రుడు’ తెలుగు ట్రైలర్.. చితక్కొట్టేశాడు!
ABN, Publish Date - May 11 , 2026 | 08:30 PM
స్టార్ హీరో సూర్య తన మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘వీరభద్రుడు’ కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
స్టార్ హీరో సూర్య (Suriya) తన మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘వీరభద్రుడు’ (VeeraBhadrudu) కోసం దర్శకుడు ఆర్జే బాలాజీ (RJ Balaji)తో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2026 మే 14న విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను సోమవారం మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది.
సూర్య సరసన త్రిష (Trisha) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో దర్శకుడు ఆర్జే బాలాజీ విలన్‌గా కనిపించబోతున్నట్లుగా ఈ ట్రైలర్ తెలియజేస్తోంది. పేరుకు తగ్గట్టుగానే సూర్య పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా ఇందులో డిజైన్ చేశారు. త్రిష పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి మెసేజ్ కూడా ఇందులో ఉన్నట్లుగా ఈ ట్రైలర్ తెలియజేస్తోంది. మరీ ముఖ్యంగా సూర్య నటన హైలెట్‌గా ఉండబోతుందనే విషయం తెలియడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. టెక్నీకల్‌గా కూడా ఈ సినిమా క్వాలిటీగా కనిపిస్తోంది. సాయి అభ్యంకర్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. మొత్తంగా అయితే, చాలా కాలం తర్వాత సూర్యకు ఒక మంచి హిట్ రాబోతుందనే హింట్‌ని ఇవ్వడంలో ఈ ట్రైలర్ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. చూద్దాం.. మే 14న ఈ ‘వీరభద్రుడు’ ఎలాంటి రిజల్ట్ రాబడతాడో..?
ఇవి కూడా చదవండి:
తన తొలి సినిమా హీరో విజయ్ పై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్!
అవసరమే కానీ.. పెళ్లిపై ఫరియా అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్!
‘అండర్ రేటెడ్’ నటిగా చూస్తున్నారా? పాయల్ రాజ్‌ఫుత్ సమాధానమిదే!
Updated at - May 11 , 2026 | 08:30 PM