‘జననాయగన్’ పైరసీపై రజనీకాంత్, మోహన్ బాబు స్పందనిదే!
ABN , Publish Date - Apr 10 , 2026 | 10:26 PM
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘జననాయగన్’ మూవీ లీకవ్వడంతో నిర్మాణ సంస్థ సీరియస్‌గా వార్నింగ్ ఇస్తూ, అందుకు కారణమైన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. చాలా రోజులుగా కష్టాలను ఫేస్ చేస్తున్న ఈ మూవీ, ఇలా పైరసీ బారిన పడటంతో ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా చిత్రయూనిట్‌కు భారీగా మద్దతు లభిస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ‘జన నాయగన్’ (Jana Nayagan) మూవీ లీకవ్వడంతో నిర్మాణ సంస్థ సీరియస్‌గా వార్నింగ్ ఇస్తూ, అందుకు కారణమైన వారిని గుర్తించే పనిలో ఉన్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. చాలా రోజులుగా కష్టాలను ఫేస్ చేస్తున్న ఈ మూవీ, ఇలా పైరసీ బారిన పడటంతో ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా చిత్రయూనిట్‌కు భారీగా మద్దతు లభిస్తోంది. పైరసీ భూతాన్ని అరికట్టడం సాధ్యమయ్యే పని కాదు. కానీ, రిలీజ్ కానీ సినిమాను ఇలా లీక్ చేయడం మాత్రం, నిజంగా దారుణమనే చెప్పుకోవాలి. అందుకే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మొదలుకుని టాలీవుడ్, కోలీవుడ్‌లోని నటీనటులందరూ ఈ విషయంపై రియాక్ట్ అవుతున్నారు. ఈ లిస్ట్‌లోకి సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth), కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) కూడా చేరారు. ఎక్స్ వేదికగా వారు చేసిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. సినిమా అనేది నమ్మకం, కష్టమే కాకుండా ఎంతోమంది కలల సమాహారమని, ఇలాంటి సంఘటనలు సినిమా పరిశ్రమలో అందరినీ ప్రభావితం చేస్తాయని అన్నారు. నిర్మాణ సంస్థ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నా, అందుకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఇప్పుడు రజనీకాంత్, మోహన్ బాబు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. ‘జన నాయగన్ చిత్రాన్ని ఎవరో ఇంటర్నెట్‌లో లీక్ చేయడం దిగ్భ్రాంతిని, తీవ్ర వేదనను కలిగించింది. చలనచిత్ర సంఘాలు దీనికి వ్యతిరేకంగా గళమెత్తాలని కోరుతున్నాను. అలాగే, ప్రభుత్వం బాధ్యులను గుర్తించి వారికి కఠినమైన శిక్ష విధించాలి. భవిష్యత్తులో ఇటువంటి నేరాలు కొనసాగకుండా చేయాలి’ అని రజనీకాంత్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
‘ఇది మొత్తం చిత్ర పరిశ్రమకు జరిగిన ఘోరమైన అపచారం, సిగ్గుచేటైన ద్రోహంగా భావిస్తున్నాను. ‘జననాయగన్’ చిత్రం ఆన్‌లైన్‌లో అక్రమంగా లీక్ అయిందనే విషయం నా మనసును కలచివేస్తోంది. వందలాది మంది అంకితభావం కలిగిన సాంకేతిక నిపుణులు, కళాకారులు, సిబ్బంది.. తమ రక్తాన్ని, చెమటను ధారపోసి, ఎన్నో ఏళ్ల కష్టాన్ని ఈ సినిమా కోసం వెచ్చించారు. ఈ నేరగాళ్ల వల్ల వారి జీవనోపాధి, భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేరానికి పాల్పడిన వారిని వెంటనే పట్టుకుని, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి. సినిమా కోసం ఎంతో మంది పడిన కష్టాన్ని నాశనం చేసే ఎవరిపైనా కనికరం చూపకూడదు. మన సినిమాలను, వాటిని సృష్టించే వారి గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. పైరసీని అంతం చేద్దాం’ అని ఎక్స్ వేదికగా మోహన్ బాబు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి:
దయచేసి రూ.16 కోట్లు సాయం చేయండి: నందమూరి బాలకృష్ణ
‘జననాయగన్’ లీక్‌పై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్
నిర్మాతని చితక్కొట్టిన రామ్ గోపాల్ వర్మ.. వీడియో వైరల్!
గుప్పెడు ఎండుమిర్చి సరిపోదు.. ‘ధురంధర్ 2’పై సందీప్ వంగా ట్వీట్ వైరల్!
సంజు శాంసన్‌పై దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు