నిర్మాతని చితక్కొట్టిన రామ్ గోపాల్ వర్మ.. వీడియో వైరల్!

ABN , Publish Date - Apr 09 , 2026 | 09:55 PM

రామ్ గోపాల్ వర్మ ఏంటి? నిర్మాతను చితక్కొట్టడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారు కదా! ఆయన ఓ నిర్మాతతో ఫైట్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రామ్ గోపాల్ వర్మతో ఫైట్ చేస్తున్న నిర్మాత మరెవరో కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితుడైన నిర్మాతే.

RGV Fight with Producer

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏంటి? నిర్మాతను చితక్కొట్టడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారు కదా! ఆయన ఓ నిర్మాతతో ఫైట్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రామ్ గోపాల్ వర్మతో ఫైట్ చేస్తున్న నిర్మాత మరెవరో కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితుడైన నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ (Tummalapalli Rama Satyanarayana). అవును, ఆయనతో రామ్ గోపాల్ వర్మ ఫైట్ చేస్తూ, చితక్కొట్టేశాడు. అయితే, ఇది నిజమైన వీడియో అనుకుంటే, పప్పులో కాలేసినట్టే. ఇది ఏఐ వీడియో. మరో విశేషం ఏమిటంటే, ఈ వీడియోను స్వయంగా సదరు నిర్మాత పేరు మీద ఉన్న ఇన్‌స్టా హ్యాండిల్‌లో పోస్ట్ చేయడం! ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ, వర్మని మళ్లీ వార్తల్లోకి తెచ్చేసింది.


గత కొంతకాలంగా వర్మ చాలా సైలెంట్‌గా ఉంటున్నారు. అందుకు కారణం ఏంటనేది తెలియలేదు కానీ, వర్మ రీసెంట్ పిక్స్‌ చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలలో, పిక్స్‌లో గుర్తు పట్టలేనంతగా, పాలిపోయిన ముఖంతో వర్మ కనిపిస్తున్నారు. నిజంగా ఆయనని చూస్తే, ఏదైనా వ్యాధితో ఇబ్బంది పడుతున్నారా? అనే అనుమానాలు కూడా రాక మానవు. విషయం ఏంటనేది తెలియదు కానీ, వర్మను అలా చూసి.. ఆయన అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడూ లేనిది, వర్మ ఏంటి ఇలా అయిపోయాడు? అంటూ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరైతే డైరెక్ట్‌గానే ముందు ఆ తాగుడు మానేయమంటూ సలహాలు ఇస్తున్నారు. అసలు వర్మకు ఏమైంది? అనేది మాత్రం ఆయన చెబితేనే తెలుస్తుంది.


ఇక వీడియో విషయానికి వస్తే.. తుమ్మలపల్లి రామ సత్యనారాయణకు రామ్ గోపాల్ వర్మ అంటే చాలా ఇష్టం. ఆయనతో సినిమాలు చేయాలని, ఆయన గైడెన్స్ తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అనుకోవడం ఏంటి? తీసుకుంటున్నారు కూడా. అందుకే, వర్మతో ఉన్న చనువు ఎలాంటిదో తెలిపేలా, ఈ వీడియోను షేర్ చేశారు. రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజున నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ షేర్ చేసిన ఈ వీడియో ఇంకా వైరల్ అవుతూనే ఉంది. ‘ఆర్జీవీ పుట్టినరోజు సందర్భంగా సినిమా తీయమని డేట్స్ అడిగితే.. నిర్మాత రామ సత్యనారాయణను కొట్టిన ప్రముఖ దర్శకుడు RGV’ అని ఈ వీడియోకు కామెంట్ జత చేశారు.

ఇవి కూడా చదవండి:

గుప్పెడు ఎండుమిర్చి సరిపోదు.. ‘ధురంధర్ 2’పై సందీప్ వంగా ట్వీట్ వైరల్!

కోసి కారం పెడ‌తా.. 'తిమ్మ‌రాజు ప‌ల్లి టీవీ' ట్రైల‌ర్ అదిరింది! తెలుగులో ఇలా కూడా సినిమాలు తీస్తున్నారా

సంజు శాంసన్‌పై దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు

సొంత వదినపై హీరోయిన్ హన్సిక రూ.2 కోట్ల పరువు నష్టం దావా

ఇప్పుడు నెంబర్ వన్ హీరో ఎవరంటే? - రాజశేఖర్

Updated Date - Apr 10 , 2026 | 01:57 PM

Ram Gopal Varma : భక్తులు చనిపోతే దేవుళ్లను అరెస్టు చేస్తారా?

Ram Gopal Varma: అబ్బా ఆర్జీవీ.. చిరంజీవికి క్ష‌మాప‌ణల వెనుక మ‌ర్మం ఇదా!

Ram Gopal Varma: డిగ్రీ పట్టాని అలా వదిలేశాడేంటి? 37 ఏళ్ళ తర్వాత..

Ram Gopal Varma: తన కళ్లతో చూసిందా.. చెవులతో విన్నదా. ఏంటీ దారుణం!

Ram Gopal Varma: ఎక్కడున్నావ్ వర్మ.. నీ ఫ్యాన్స్ వెయిటింగ్