గుప్పెడు ఎండుమిర్చి సరిపోదు.. ‘ధురంధర్ 2’పై సందీప్ వంగా ట్వీట్ వైరల్!

ABN , Publish Date - Apr 09 , 2026 | 06:43 PM

సౌత్ నుంచి నార్త్ వరకు ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిన పేరు ‘ధురంధర్ 2’. ఈ సినిమాపై బాలీవుడ్ ప్రముఖులు సైలెంట్‌గా ఉన్నారు కానీ, సౌత్‌లోని స్టార్స్ అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి సందీప్ రెడ్డి వంగా కూడా చేరారు.

Sandeep Reddy Vanga on Dhurandhar 2

సౌత్ నుంచి నార్త్ వరకు ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిన పేరు ‘ధురంధర్ 2’ (Dhurandhar 2). ఈ సినిమాపై బాలీవుడ్ ప్రముఖులు సైలెంట్‌గా ఉన్నారు కానీ, సౌత్‌లోని స్టార్స్ అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కూడా చేరారు. బుధవారం రాత్రి తన ‘స్పిరిట్’ (Spirit) హీరో, రెబల్ స్టార్ ప్రభాస్‌ (Rebel Star Prabhas)తో కలిసి ఆయన ఈ సినిమాను చూస్తున్నట్లుగా కొన్ని వీడియోలు వైరలైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్‌లో ‘ధురంధర్ 2’ చిత్రాన్ని వీక్షించిన సందీప్ రెడ్డి వంగా, తాజాగా ట్విట్టర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌తో.. టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారారు. మాములుగా అందరూ సినిమాపై ప్రశంసలు కురిపిస్తారు. కానీ, సందీప్ తన స్పెషలేంటో ఈ ట్వీట్‌తో మరోసారి తెలియజేశారు.


నిజాయితీగా సినిమా తీస్తే దానికి ‘ప్రొపగండా’ అనే ముద్ర వేసే వారిపై వంగా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. సినిమా చూసిన ఆవేశంలో అలా చేశారో, లేదంటే పరిశ్రమలోని ద్వంద్వ ప్రమాణాల మీద కోపమో తెలియదు కానీ, వంగా వేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘‘చాలామంది రచయితలు, నటులు ప్రొపగండా ద్వారానే కెరీర్‌లను నిర్మించుకున్నారు. అప్పట్లో ఇండస్ట్రీ అంతా పిల్లుల్లా మౌనంగా ఉంది. కానీ ఇప్పుడు అదే వర్గం ‘ధురంధర్’ వంటి సినిమాలను ఎగతాళి చేస్తోంది. ఎదుటివారిని హేళన చేయడం మీ మొదటి నైజం అయితే, మిమ్మల్ని మీరు లిబరల్స్ అని పిలుచుకునే అర్హత మీకు లేదు’’ అని సినిమా రంగంలోని కొంతమంది నటీనటులు, రచయితల తీరును ఆయన తప్పుబడుతూ ఘాటుగా స్పందించారు (Sandeep Vanga on Dhurandhar 2). నిజాన్ని ప్రొపగండా అనడం ఈ కాలంలో ఒక వింతైన ఫ్యాషన్‌గా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


సినిమా దర్శకుడు ఆదిత్య ధర్, హీరో రణవీర్ సింగ్‌ను ఉద్దేశించి వంగా ఒక పవర్‌ఫుల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ‘‘ఈ కాల దృష్టి అంత సులభంగా పోదు. గుప్పెడు ఎండుమిర్చి చల్లితే సరిపోదు.. ఏకంగా పొలాన్నే తగలేయాలి’’ అంటూ తనదైన శైలిలో సినిమాపై ప్రశంసలు కురిపించారు. అల్లు సినిమాస్‌లో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కలిసి ఈ సినిమా చూడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో ‘స్పిరిట్’ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ‘ధురంధర్ 2’ సినిమా అవుట్‌స్టాండింగ్‌గా ఉందంటూ వంగా ఇచ్చిన రివ్యూతో సోషల్ మీడియాలో ఈ సినిమాపై మరోసారి టాక్ మొదలైంది.

ఇవి కూడా చదవండి:

కోసి కారం పెడ‌తా.. 'తిమ్మ‌రాజు ప‌ల్లి టీవీ' ట్రైల‌ర్ అదిరింది! తెలుగులో ఇలా కూడా సినిమాలు తీస్తున్నారా

సంజు శాంసన్‌పై దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు

సొంత వదినపై హీరోయిన్ హన్సిక రూ.2 కోట్ల పరువు నష్టం దావా

ఇప్పుడు నెంబర్ వన్ హీరో ఎవరంటే? - రాజశేఖర్

స్క్రీన్స్ తక్కువ.. క్రేజ్ ఎక్కువ! డ్యూన్ మేనియా షురూ.. ఒక్కో టికెట్ 90 వేలు

Updated Date - Apr 09 , 2026 | 06:51 PM

Dhurandhar The Revenge: ఇదెక్క‌డి క్రేజ్‌రా.. రిలీజ్‌కు ముందే సునామీ సృష్టిస్తోంది

Dhurandhar OTT: దురంధర్ ఓటీటీకి వ‌చ్చేశాడు! తెలుగులో కూడా.. సినీ ల‌వ‌ర్స్‌కు ఇక పండ‌గే

Sandeep Reddy Vanga: అప్పట్లో రంగస్థలం.. ఇప్పుడు పొట్టేల్‌

Sandeep Reddy Vanga: అందుకే అమ్మ పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వను.. సందీప్ రెడ్డి

Sandeep Reddy Vanga: చిరంజీవి పేరుతో సమాధానమిచ్చేసరికి అంతా షాక్‌!