రజనీకాంత్‌కు విలన్‌గా శంకర్.. ఈ ట్విస్ట్ ఏంటయ్యో?
ABN, Publish Date - Apr 25 , 2026 | 09:37 AM
రజనీకాంత్ తన 173వ ప్రాజెక్ట్‌పై పూర్తి దృష్టి సారించారు. ముఖ్యంగా లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌పై ఈ భారీ యాక్షన్ డ్రామాను నిర్మిస్తుండటంతో, కోలీవుడ్ వర్గాల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) ప్రస్తుతం వేగంగా సినిమాలు పూర్తి చేస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నారు. ‘జైలర్’ వంటి భారీ విజయం తర్వాత, దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్-2’ (Jailer 2) షూటింగ్‌ను ఆయన ఇప్పటికే పూర్తి చేశారు. ఈ చిత్రం తర్వాత రజనీకాంత్ తన 173వ ప్రాజెక్ట్‌పై పూర్తి దృష్టి సారించారు. ముఖ్యంగా లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌పై ఈ భారీ యాక్షన్ డ్రామాను నిర్మిస్తుండటంతో, కోలీవుడ్ వర్గాల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి దర్శకుడి విషయంలో అనేక మార్పులు జరిగాయి. మొదటగా సీనియర్ డైరెక్టర్ సుందర్ సి పేరు వినిపించినా, ఆయన వ్యక్తిగత కారణాల వల్ల తప్పుకోవడంతో ఈ బాధ్యత ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఆ తర్వాత ‘డాన్’ ఫేమ్ శిబి చక్రవర్తి పేరు ప్రముఖంగా వినిపించింది. రజనీకాంత్ కోసం శిబి ఏకంగా 80కి పైగా డిఫరెంట్ గెటప్స్‌ను డిజైన్ చేయించారని, ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని వార్తలు వచ్చాయి. మధ్యలో ‘డ్రాగన్’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు పేరు తెరపైకి వచ్చినప్పటికీ, చివరికి శిబి చక్రవర్తినే దర్శకుడిగా ఖరారైనట్లు సమాచారం.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో వినిపిస్తున్న మరో బిగ్గెస్ట్ న్యూస్ ఏమిటంటే, దిగ్గజ దర్శకుడు శంకర్ (Director Shankar) ఇందులో విలన్ పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘శివాజి’, ‘రోబో’, ‘2.0’ వంటి సంచలన చిత్రాలతో రజనీని డైరెక్ట్ చేసిన శంకర్, ఇప్పుడు ఆయనకు ఎదురుగా పవర్‌ఫుల్ విలన్‌గా స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక అరుదైన విషయంగా మారుతుంది. ఈ పాత్ర కోసం చిత్ర బృందం శంకర్‌ను సంప్రదించగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ నిజమైతే వెండితెరపై హీరో-విలన్ల పోరు నెక్స్ట్ లెవల్‌లో ఉండటం ఖాయం. కేవలం శంకర్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో కమల్ హాసన్ ఒక కీలకమైన అతిథి పాత్రలో మెరవబోతున్నట్లు వస్తున్న వార్తలు అభిమానులను థ్రిల్ చేస్తున్నాయి. ఒకవేళ ఇది పట్టాలెక్కితే, దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రజనీ - కమల్ జోడీని ఒకే ఫ్రేమ్‌లో చూసే అవకాశం లభిస్తుంది. కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తూనే, ఈ చిత్రంలో భాగం కావడం ప్రాజెక్ట్ విలువను అమాంతం పెంచేసింది. ‘ధురంధర్’ తరహా మాస్ ఫార్ములాతో సరికొత్తగా ఈ సినిమాను తీర్చిదిద్దాలని టీమ్ భావిస్తోంది.
రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా, రజనీకాంత్ క్యారెక్టర్ లుక్స్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఏకంగా 80కి పైగా వైవిధ్యమైన గెటప్స్‌ను సిద్ధం చేయడం సినిమాలోని వైవిధ్యాన్ని సూచిస్తోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి శంకర్ ఎంట్రీ, కమల్ క్యామియో, దర్శకుడి అధికారిక ప్రకటన కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!
అందుకే చిరు.. ‘ఠాగూర్’ సినిమాపై రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘పెద్ది’ రిలీజ్ డేట్.. మరోసారి ‘లెనిన్’ త్యాగం చేయాల్సిందేనా!
తమన్నాతో బ్రేకప్.. మరో యంగ్ బ్యూటీని పట్టిన విజయ్ వర్మ!