Rajinikanth - Mohan Babu: కోపాన్ని ఎందుకు వదల్లేకపోతున్నావ్‌..

ABN , Publish Date - Jul 22 , 2025 | 03:06 PM

ఓ ఇంగ్లిష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీతో ఉన్న స్నేహం గురించి చెప్పుకొచ్చారు మోహన్ బాబు


రజనీకాంత్‌(Rajinikanth), మంచు మోహన్‌బాబు (mohan babu) ఇద్దరూ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే! రజనీకాంత్‌ తనకు బెస్ట్‌ ఫ్రెండ్‌ అని పలుమార్లు చెప్పారు మోహన్‌బాబు. తాజాగా మరోసారి ఆ విషయాన్ని ఓ ఇంగ్లిష్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. రజనీతో ఉన్న స్నేహం గురించి చెప్పుకొచ్చారు.

‘50 ఏళ్ల క్రితం మా వద్ద ఏమీ లేనప్పుడు, నటుడిగా పరిచయం కాకముందు మద్రాసు ఫ్లాట్‌ఫామ్‌పై ఫస్ట్‌ టైం కలుసుకున్నాం. అప్పటి నుంచి మా బంధం కొనసాగుతోంది. రోజులో కనీసం 3, 4 సార్లైనా మెసేజ్‌లు చేసుకుంటాం. 50 ఏళ్లగా ఈ జర్నీ ఇలాగే కొనసాగుతుంది. రజనీకాంత్‌ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి.. నేను అతడిని ‘ఏయ్‌ బ్లడీ తలైవా’ అని ముద్దుగా పిలుస్తాను. అంత చనువు మా మఽధ్య ఉంది. ఈ మఽధ్యన కలిసినప్పుడు అతడు ఒకమాట చెప్పాడు. ‘నాకు గతంలో ఎంత కోపం ఉండేదో నీకు తెలుసు. నేను తర్వాత కాలంలో దాన్ని వదిలేశాను. నువ్వెందుకు వదల్లేకపోతున్నావు. పుస్తకాలు చదవడం కాదు.. అందులోని సారాంశాన్ని అర్థం చేసుకొని కోపాన్ని వదిలెయ్‌’ అని సలహా ఇచ్చాడు’’ అని మోహన్‌బాబు అన్నారు. రజనీ హైదరాబాద్‌ వచ్చిన ప్రతిసారీ మోహన్‌బాబుని కలుస్తుంటారు. ఇటీవల విడుదలైన కన్నప్ప చిత్రంలో మోహన్‌బాబు వాయులింగాన్ని కాపాడుకుంటూ వస్తున్న మహాదేవ శాస్త్రి పాత్రలో నటించి మెప్పించారు. ఈ చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్‌   సినిమా టీమ్‌ను అభినందించారు. 

ALSO READ:

MM Keeravani Surprise: అప్పుడు రాజమౌళి కోసం.. ఇప్పుడు పవన్‌ కోసం.. ఫ్యాన్స్‌కి పండగే

Ustaad Bhagat singh: ఉస్తాద్‌లో రాశీఖన్నా అఫీషియల్‌.. దర్శకుడి ట్వీట్‌ వైరల్‌


త‌ప్పిపోయిన‌ బాలిక‌.. పాతికేళ్లకు చనిపోయి క‌నిపిస్తే! అదిరిపోయే మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్

ఈ వారం.. ఓటీటీల్లో ర‌చ్చ ర‌చ్చే! ఒక‌దాన్ని మించింది మ‌రోటి

మీ స‌హానాన్ని ప‌రీక్షించే సినిమా.. ఓటీటీకి వ‌చ్చేసింది

Updated Date - Jul 22 , 2025 | 03:22 PM