తమన్నాతో బ్రేకప్.. మరో యంగ్ బ్యూటీని పట్టిన విజయ్ వర్మ!
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:38 PM
సెలబ్రిటీలు ఎవరు, ఎప్పుడు, ఎవరితో రిలేషన్‌లో ఉంటారో, ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో చెప్పడం కష్టం. తమకు నచ్చిన వాళ్లతో రిలేషన్, అది నచ్చకపోతే బ్రేకప్.. ఇది సెలబ్రిటీల లైఫ్‌లో కామన్ అయిపోయింది.
సెలబ్రిటీలు ఎవరు, ఎప్పుడు, ఎవరితో రిలేషన్‌లో ఉంటారో, ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో చెప్పడం కష్టం. తమకు నచ్చిన వాళ్లతో రిలేషన్, అది నచ్చకపోతే బ్రేకప్.. ఇది సెలబ్రిటీల లైఫ్‌లో కామన్ అయిపోయింది. రీసెంట్‌గా మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia), విజయ్ వర్మ (Vijay Varma) ఎలా చెట్టాపట్టాలేసుకుని తిరిగారో తెలియంది కాదు. ఒక స్టేజ్‌లో వారిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనేలా వార్తలు వైరల్ అయ్యాయి. మరి ఏమైందో, ఏమో తెలియదు కానీ, సడెన్‌గా ఇద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. వారి బ్రేకప్‌కి కారణం ఏంటనేది స్పష్టంగా తెలియలేదు కానీ, తమన్నా సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని ట్వీట్స్‌ను బట్టి, ఆమెను విజయ్ వర్మ హర్ట్ చేశాడనేది మాత్రం అర్థమైంది. ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్న తర్వాత, ఎవరి పని వారు చేసుకుంటున్నారు. బ్రేకప్ టైమ్‌లో ఈ జంటపై రకరకాలుగా వార్తలు వినిపించాయి, కానీ ఈ మధ్యకాలంలో మాత్రం సైలెంట్‌గా అంతా నడుస్తోంది.
తమన్నా, విజయ్ వర్మల బ్రేకప్ తర్వాత.. మళ్లీ వీరు కలుసుకుంటారా? అనేలా కూడా వార్తలు హైలెట్ అయ్యాయి. కానీ ఆ ఛాన్స్.. లేనే లేదు అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. అదెలా అనుకుంటున్నారా? తమన్నాతో బ్రేకప్ తర్వాత నటుడు విజయ్ వర్మ మరో యంగ్ బ్యూటీతో రిలేషన్ మొదలు పెట్టినట్లుగా బాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయ్ తరచూ ఓ యంగ్ బ్యూటీని వెంటేసుకుని కనిపించడంతో, అసలు ఎవరా ఈ భామ? అని అంతా సెర్చింగ్ మొదలెట్టారు. రీసెంట్‌గా ఓ రెస్టారెంట్‌లో వీరు మీడియాకు దొరికేశారు. దీంతో, విజయ్ వర్మపై ఏ విధంగా వార్తలు వినిపించాలో.. ఆ విధంగానే వార్తలు మొదలయ్యాయి. ఇంతకీ విజయ్‌తో ఉన్న ఆ యంగ్ బ్యూటీ ఎవరని అనుకుంటున్నారా?
షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాలోని గర్ల్ గ్యాంగ్‌లో ‘జాన్వి’ పాత్రలో మెరిసిన ఆలియా ఖురేషి (Alia Qureshi)నే ప్రస్తుతం విజయ్ వర్మతో రిలేషన్‌లో ఉన్న భామ అంటూ బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. ఆలియా ఖురేషి కేవలం నటి మాత్రమే కాదు, సింగర్ కూడా. ఇన్‌స్టాలో ‘ఝాలివర్స్’ పేరుతో ఉన్న ఆమెకు లక్షల్లో ఫాలోయర్స్ ఉన్నారు. తమన్నాతో రిలేషన్‌లో ఉన్నప్పుడు విజయ్ వర్మ ఎంత అదృష్టవంతుడో అని అంతా అనుకున్నారు. ఆమెతో బ్రేకప్ అయిన కొద్ది రోజులకే ఆలియా ఖురేషి వంటి యంగ్ బ్యూటీని విజయ్ పట్టడంతో.. ఆయనకి అదృష్టం అమ్మాయిల రూపంలో పట్టిందంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి వీరి రిలేషన్ ఎంతకాలం సాగుతుందో? చూద్దాం.
ఇవి కూడా చదవండి:
ఓటు ఎవరికి వేశాడో.. పబ్లిగ్గా చెప్పేసిన వీటీవీ గణేష్.. వీడియో వైరల్!
ధనుష్ - మృణాల్.. మళ్లీ మొదలు! అసలు విషయం ఏమిటంటే?
చిరంజీవి ఇంటికి సమీపంలోనే అల్లు అర్జున్ లగ్జరీ హౌస్.. ఎన్ని కోట్లంటే?