సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దర్శకుడిగా, హీరోగా.. ఇప్పుడు నిర్మాతగా!

ABN, Publish Date - May 27 , 2026 | 11:40 PM

కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ కెరీర్‌లో మరో కీలక అడుగు వేశారు. దర్శకుడిగా మెప్పించి, హీరోగా వంద కోట్ల క్లబ్‌లో చేరి స్టార్‌డమ్ సంపాదించుకున్న ప్రదీప్.. ఇప్పుడు నిర్మాతగా సరికొత్త అవతారమెత్తారు.

Pradeep Ranganathan

కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) కెరీర్‌లో మరో కీలక అడుగు వేశారు. దర్శకుడిగా మెప్పించి, హీరోగా వంద కోట్ల క్లబ్‌లో చేరి స్టార్‌డమ్ సంపాదించుకున్న ప్రదీప్.. ఇప్పుడు నిర్మాత (Producer)గా సరికొత్త అవతారమెత్తారు. ఇందుకోసం ఆయన సొంతంగా ఒక నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా, సైలెంట్‌గా ఈ ప్రొడక్షన్ హౌస్‌లో తన తొలి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు ప్రదీప్ సర్వం సిద్ధం చేశారనే వార్త.. ఇప్పుడు చెన్నై సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


సొంత బ్యానర్‌లో ప్రదీప్ రంగనాథన్ నిర్మించబోయే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ మమితా బైజు ప్రధాన పాత్ర పోషించనున్నట్లు సమాచారం. వీరిద్దరూ అంతకుముందు ‘డ్యూడ్’ అనే చిత్రంలో కలిసి నటించారు. ఆ పరిచయంతోనే ఆమెలోని నటనను గుర్తించిన ప్రదీప్, తన మొదటి నిర్మాణంలో ఆమెకు లీడ్ రోల్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కంటెంట్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి.


రవి మోహన్ హీరోగా వచ్చిన ‘కోమాలి’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రదీప్ రంగనాథన్, ఆ తర్వాత తనే స్వయంగా నటించి, డైరెక్ట్ చేసిన ‘లవ్ టుడే’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ‘డ్రాగన్’, ‘డ్యూడ్’, ‘ఎల్‌ఐకే’ వంటి వరుస క్రేజీ చిత్రాలతో విజయాలు అందుకున్న ప్రదీప్, ప్రస్తుతం ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో వస్తున్న ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఓవైపు హీరోగా ఫుల్ బిజీగా ఉంటూనే, మరోవైపు నిర్మాతగా కూడా మారడం ప్రదీప్ మల్టీ-టాలెంట్‌కు నిదర్శనమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి:

‘రంగస్థలం’ చిట్టిబాబుకి, ‘పెద్ది’కి ఉన్న తేడా ఏంటంటే?

‘అమ్మ’కు ఏమైంది? మరో సీనియర్ నటి సంచలన ఆరోపణలు!

మళ్లీ కత్తిలా తయారైన కాజల్.. ఈ గ్లామర్ ఫొటోలు చూశారా!

System Movie Review: సోనాక్షి సిన్హా, జ్యోతిక 'సిస్టమ్‌' ఓటీటీ మూవీ రివ్యూ

Updated Date - May 27 , 2026 | 11:40 PM