Pradeep Ranganathan: ఈసారి దర్శకుడిగా నటుడిగా సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్

ABN , Publish Date - Dec 18 , 2025 | 09:31 AM

ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉన్న నటుడు ప్రదీప్ రంగనాథన్‌. సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు.

ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజ్ ఉన్న నటుడు ప్రదీప్ రంగనాథన్‌(Pradeep Ranganathan). సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్‌ సంస్థ సినిమా మరో చేస్తున్నారని నిర్మాతల్లో ఒకరైన అర్చన కల్పాతి వెల్లడించారు. ‘డ్యూడ్‌’ విజయంతో ప్రదీప్‌ రంగనాథన్‌ (పీఆర్‌) బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెల్సిందే. ఈ మూవీ తర్వాత ఆయన ఏజీఎస్‌ (AGS) నిర్మించే చిత్రంలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు చేపడతారనే ప్రచారం జరిగింది. 

ఈ విషయంపై అర్చన  మాట్లాడుతూ, ‘ప్రదీప్‌ రంగనాథన్‌ ఒక చిత్రానికి దర్శకత్వం వహించి హీరోగా నటించనున్నారు. 2026లో చిత్రీకరణ ప్రారంభించి, అదే యేడాది రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం’ అని వెల్లడించారు. అయితే, ఈ మూవీ సైన్స్‌ ఫిక్షన్‌ జోనర్‌లో రూపొందించాలని ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. కాగా, ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా వచ్చిన ‘లవ్‌టుడే’, ‘డ్రాగన్‌’, ‘డ్యూడ్‌’ చిత్రాలు బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో పాటు రూ.వంద కోట్ల కలెక్షన్స్‌ రాబట్టిన విషయం తెల్సిందే.

Updated Date - Dec 18 , 2025 | 09:31 AM