Pradeep Ranganathan: డైరెక్టర్ కమ్ హీరోగా ప్రదీప్ ర్యాంపేజ్
ABN , Publish Date - Oct 07 , 2025 | 05:42 PM
కోలీవుడ్ కుర్రాడు ప్రదీప్ రంగనాథన్ ఇరగదీస్తున్నాడు. ఏ ఛాన్స్ దొరికినా వదలకుండా కుమ్మేస్తున్నాడు. స్వ, పర బేధం లేకుండా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. తాజాగా మరో క్రేజీ న్యూస్ ను షేర్ చేశాడు.
కోలీవుడ్ డైరెక్టర్ కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) టైం ఇప్పుడు మామూలుగా లేదు. 'లవ్ టుడే' (Love Today) తో యూత్‌లో యమ క్రేజ్ తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ స్టార్ 'డ్రాగన్' (Dragon) హిట్ తో మరో మెట్టు ఎక్కాడు. ఆ తర్వాత క్రేజీ అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో ఇక ఈ ఏడాది వరుస సినిమాలతో రచ్చ చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను విడుదలవుతుండగా.. మరో క్రేజీ ప్రాజెక్టును హ్యాండిల్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ హీరో.
ఈ ఏడాది 'డ్యూడ్' (DUDE) అలాగే 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (Love Insurance Company) సినిమాలతో థియేటర్లలో సందడి చేయనున్నాడు. అక్టోబర్ 17 దీపావళి సందర్భంగా 'డ్యూడ్' విడుదల కాబోతోంది. ఈ సినిమాను కీర్తిశ్వరన్ ((Keerthiswaran)) డైరెక్ట్ చేశాడు. 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు (Mamitha Baiju) హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రదీప్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి అలరిస్తాడని చెప్పుకుంటున్నారు. ఇక డిసెంబర్ 18న విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) డైరెక్షన్‌లో నటిస్తున్న 'లవ్ ఇన్స్సూరెన్స్ కంపెనీ' విడుదల కాబోతోంది. దీనిపై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా 'డ్యూడ్' సినిమా ప్రమోషన్స్ లో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశాడు ప్రదీప్ రంగనాథన్.
'లవ్ ఇన్స్సూరెన్స్ కంపెనీ' తర్వాత.. మరోసారి డైరెక్టర్ కమ్ హీరో అవతారం ఎత్తబోతున్నాడు ప్రదీప్. ఓ సైంటిఫిక్ ఫిక్షన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. స్టోరీ అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటుందని... ప్రేక్షకులు తనలో కొత్త యాంగిల్ చూస్తారని కాన్పిండెట్ గా చెప్తున్నాడు. ఈ మూవీతో తన కెరీర్‌లో మరో మైల్‌స్టోన్ సెట్ చేస్తానని అంటున్నాడు. దీంతో అప్పుడే ఈ సినిమాపై డిస్కషన్లు మొదలైపోయాయి. చూడాలి మరి ప్రదీప్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో.
Read Also: Kamal - Rajani: కమల్ - రజనీ మల్టీస్టారర్ దర్శకుడు క్లారిటీ..
Read Also: Jr NTR: ఆగిన దాదా సాహేబ్ ఫాల్కే బయోపిక్...