Pradeep Ranganathan: తనకు తానే పోటీ అంటున్న ప్రదీప్
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:37 PM
నటుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) నటించిన రెండు చిత్రాలు ఒకేరోజు విడుదల కానున్నాయి.
నటుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) నటించిన రెండు చిత్రాలు ఒకేరోజు విడుదల కానున్నాయి. దీపావళి సందర్భంగా ప్రదీప్ నటించిన ‘డూడ్’(dude), ‘ఎల్‌ఐకే’ (LIK) చిత్రాలు ప్రేక్షకుల చెంతకు రానున్నాయి. ‘కోమాలి’, ‘లవ్ టుడే’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రదీప్ రంగనాథన్, లవ్ టుడే చిత్రంలో హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అతను నటించిన ‘డ్రాగన్’ చిత్రం కూడా విజయం సాధించింది. ప్రస్తుతం ఎల్‌ఐకే (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ), డూడ్ అనే రెండు చిత్రాలు రూపొందుతున్నాయి.
ALSO READ: Deva Katta: ఆరున్నర గంటల సినిమా అనుకోవచ్చు
డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఎల్‌ఐకే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి శెట్టి, ప్రధాన పాత్రలో ఎస్‌జే సూర్య నటిస్తున్నారు. అలాగే, ‘డూడ్’ చిత్రం ద్వారా కీర్తీశ్వరన్ దర్శకుడిగా పరిచయం కానున్నాయి. ఈ చిత్రంలో మమిత బైజూ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ క్రమంలో, ఈ రెండు చిత్రాలు దీపావళి సందర్భంగా అక్టోబరు 17వ తేది విడుదల కానున్నాయి. కాగా, తమిళం, తెలుగులో రూపొందుతున్న ‘డూడ్’ చిత్రం తొలి సాంగ్ ఈ నెల 28వ తేది విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది.
ALSO READ: Sankar Kumar: ప్రముఖ కార్టూనిస్ట్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ శంకు కన్నుమూత
Bad Girlz: సిద్ శ్రీరామ్.. మరోసారి అదరగొట్టాడుగా! ఇలా చూసుకుంటానే.. లిరికల్ వీడియో సాంగ్
Madharaasi: బక్కోడు.. మరో పాటతో వచ్చాడు! వర...వర వరదల్లే వీడియో సాంగ్