Pradeep Ranganathan: వరుస హిట్లకు బ్రేక్.. రివర్స్‌ కొట్టిన హీరో ప్లాన్‌

ABN , Publish Date - Apr 11 , 2026 | 09:22 PM

‘కోమలి’తో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి, ‘లవ్ టుడే’తో హీరోగా మారి.. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ప్రదీప్ రంగనాథన్ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్. ‘డ్రాగన్, డ్యూడ్’ అంటూ వరుసగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కుర్ర హీరోకి, తాజాగా రిలీజైన ‘LIK’ మూవీ ఒక స్పీడ్ బ్రేకర్ లాగా తగిలింది.

Pradeep Ranganathan

‘కోమలి’ (Komali)తో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి, ‘లవ్ టుడే’ (Love Today)తో హీరోగా మారి.. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) అంటే ఇప్పుడు ఒక బ్రాండ్. ‘డ్రాగన్, డ్యూడ్’ అంటూ వరుసగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కుర్ర హీరోకి, తాజాగా రిలీజైన ‘LIK’ మూవీ ఒక స్పీడ్ బ్రేకర్ లాగా తగిలింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ప్రదీప్ కెరీర్‌లో ఇది మొదటి ఫ్లాప్‌గా మిగిలిపోయింది. ప్రదీప్ రంగనాథన్ అంటే ఒక క్రేజ్. యూత్ పల్స్ తెలిసిన హీరో. లవ్ టుడేతో అతను సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆ సినిమాతో ఒక్కసారిగా టాప్ లీగ్‌లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా అతనికి మంచి మైలేజ్ ఇచ్చాయి.


ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో, లేడీ సూపర్ స్టార్ నయనతార నిర్మాణంలో వచ్చిన సినిమానే ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (Love Insurance Kompany). ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ అంటూ అనౌన్స్‌మెంట్ నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. కానీ, థియేటర్లలోకి వచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఈ సినిమా ఫెయిల్యూర్ కి ప్రధాన కారణం.. కంటెంట్..! ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ అని చెప్పినప్పటికీ, కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం ప్రేక్షకులను నిరాశకు గురిచేసింది. టెక్నికల్‌గా సినిమా బాగున్నా, కథనం నెమ్మదిగా సాగడం పెద్ద మైనస్ అని చెప్పాలి. అంతేకాకుండా, షూటింగ్ పూర్తయి చాలా కాలం డబ్బాలో ఉండిపోవడం వల్ల కూడా సినిమా మీద బజ్ తగ్గిపోయింది. సినిమా రిలీజ్ అయ్యే సరికి ఆ కాన్సెప్ట్ పాతదిగా అనిపించడం, ప్రచారంలో కూడా ఎక్కడో చిన్న లోపం కనిపించడం సినిమాను దెబ్బతీశాయి.


భారీ బడ్జెట్ పెట్టిన నయనతారకు ఇది పెద్ద ఆర్థిక భారంగా మారిందని ఇండస్ట్రీ టాక్. వరుస హిట్లతో ఉన్న ప్రదీప్ రంగనాథన్‌కు ఇది ఒక విధంగా ఒక పెద్ద లెసన్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు అతను చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఈ ‘Lik’ రిజల్ట్ మరొక ఎత్తు. మరో విషయం ఏమిటంటే, కేవలం క్రేజ్ ఉంటే సరిపోదు, బలమైన కథ కూడా ఉండాలని ఈ సినిమా రిజల్ట్ మరోసారి నిరూపించింది. అయితే ప్రదీప్ రంగనాథన్ వంటి టాలెంటెడ్ పర్సన్‌కి ఇది ఒక చిన్న ఎదురుదెబ్బ మాత్రమే. తన తదుపరి సినిమాలతో కచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాడన్న నమ్మకం అందరిలో ఉంది.

ఇవి కూడా చదవండి:

Chiranjeevi: చిరంజీవికి తప్పని వెయిటింగ్.. ఈ అడ్డంకులేంటి?

Venu Udugula: మంగ్లీ ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు

UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!

Jailer 2: షారుఖ్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్.. బాబోయ్, ఈ వార్త నిజమైతేనా?

దయచేసి రూ.16 కోట్లు సాయం చేయండి: నందమూరి బాలకృష్ణ

Updated Date - Apr 11 , 2026 | 09:22 PM

Pradeep Ranganadhan: వివాదంలో డ్యూడ్ టైటిల్...

Pradeep Ranganathan: ఈసారి దర్శకుడిగా నటుడిగా సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్

Pradeep Ranganathan: డైరెక్టర్ కమ్ హీరోగా ప్రదీప్ ర్యాంపేజ్

Love Insurance Kompany: ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ ఫస్ట్‌లుక్‌ విడుదల

Pradeep Ranganathan: తనకు తానే పోటీ అంటున్న ప్రదీప్‌