సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pooja Hegde: ఆ గౌరవాన్ని దూరం చేశారు.. ‘జననాయగన్’ లీక్‌పై పూజా హెగ్డే

ABN, Publish Date - Apr 11 , 2026 | 03:36 PM

సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులెందరో ‘జననాయగన్’ పైరసీపై గళమెత్తారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన బుట్టబొమ్మ పూజా హెగ్డే ఫైర్ అవుతూ, సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేశారు.

Pooja Hegde on Jana Nayagan Piracy

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన ‘జననాయగన్’ (Jana Nayagan) మూవీ పైరసీ విషయంలో సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి చిత్రబృందానికి భారీగా మద్దతు లభిస్తోంది. సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులెందరో ఈ పైరసీపై గళమెత్తారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ఫైర్ అవుతూ, సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేశారు. సినిమా విడుదల కాకుండానే, ఇంటర్నెట్‌లో లీకవ్వడం (Jana Nayagan Piracy) చూస్తుంటే చాలా బాధగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన లేఖలో..


‘‘ప్రేక్షకులారా.. ఒక సినిమా అనేది లెక్కలేనన్ని గంటల శ్రమ, క్రియేటివ్ రిస్క్‌లు, వ్యక్తిగత త్యాగాల కలయికతో రూపుదిద్దుకుంటుంది. మీకు ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇవ్వాలనే ఆశతో ప్రతిరోజూ పని చేసిన ఒక టీమ్ కృషి అది. అలా ఎంతో శ్రమించి, సిద్ధం చేసిన మా సినిమా.. ఇలా ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇది కేవలం నాకు మాత్రమే కాదు, ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఎంతో నిరాశను కలిగిస్తోంది. మా సినిమా ఇలా లీక్ అవ్వడం, సోషల్ మీడియాలో షేర్ కావడం చూస్తుంటే, చాలా కష్టంగా ఉంది. ఇది కేవలం కలెక్షన్ల గురించి మాత్రమే కాదు.. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి నటుడు, సాంకేతిక నిపుణుడు పొందాల్సిన గౌరవాన్ని ఇది దూరం చేస్తుంది. పైగా, మనమంతా ఎంతో ఇష్టపడే విజయ్ సార్ చివరి సినిమాను, ఆఖరిసారిగా వెండితెరపైనే సరైన రీతిలో కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కదా? కాబట్టి, సినిమాను సరైన పద్ధతిలోనే చూద్దాం.. దయచేసి సినిమా థియేటర్లలోకి వచ్చే వరకు వేచి ఉండండి. సరైన సమయంలోనే కచ్చితంగా సినిమా విడుదలవుతుంది. దయచేసి పైరసీని ప్రోత్సహించకండి. అప్పుడే సినిమా, కళ బ్రతుకుతాయి’’ అంటూ కళ, కళాకారులు, సాంకేతిక నిపుణుల తరుపున తను చెబుతున్నట్లుగా పూజా హెగ్డే ఈ లేఖ ద్వారా ప్రేక్షకులకు తెలిపారు.


వాస్తవానికి, సినిమా అవకాశాలపరంగా పూజా హెగ్డే పరిస్థితి ప్రస్తుతం ఏమంత బాగా లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఈ తారకు, ఇప్పుడు అవకాశాలే కరువయ్యాయి. తన చేతిలో ఉన్న బిగ్ ప్రాజెక్ట్ అంటే, అది ‘జననాయగన్’ మాత్రమే. ఆ సినిమా ఇలా లీక్ కావడంతో, పూజా తీవ్ర నిరాశకు లోనవుతున్నట్లుగా ఆమె చేసిన ఈ పోస్ట్ చూస్తుంటే తెలుస్తోంది. ఏదో అనుకుంటే మరేదో అయినట్లుగా.. ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ఇలా పైరసీ పాలు కావడం చూస్తుంటే.. పూజాకు ఈ మధ్యకాలంలో అస్సలు కలిసిరావడం లేదనే చెప్పుకోవాలి. చూద్దాం.. పూజా హెగ్డే మళ్లీ ఎలా ఫామ్‌లోకి వస్తుందో?

ఇవి కూడా చదవండి:

Jailer 2: షారుఖ్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్.. బాబోయ్, ఈ వార్త నిజమైతేనా?

దయచేసి రూ.16 కోట్లు సాయం చేయండి: నందమూరి బాలకృష్ణ

‘జననాయగన్’ లీక్‌పై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్

నిర్మాతని చితక్కొట్టిన రామ్ గోపాల్ వర్మ.. వీడియో వైరల్!

గుప్పెడు ఎండుమిర్చి సరిపోదు.. ‘ధురంధర్ 2’పై సందీప్ వంగా ట్వీట్ వైరల్!

Updated Date - Apr 11 , 2026 | 03:42 PM