Pooja Hegde Latest Film: పూజ హెగ్డే, కార్తిలతో తెలుగు, తమిళంలో సురేష్ బాబు సినిమా

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:02 AM

ఎట్టకేలకు నటి పూజ హెగ్డే ఒక తెలుగు సినిమా ఒప్పుకున్నారని తెలిసింది. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఉండబోతోందని ఇందులో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్నారని, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారని తెలిసింది. త్వరలో ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయని అంటున్నారు

Pooja Hegde Latest Film: పూజ హెగ్డే, కార్తిలతో తెలుగు, తమిళంలో సురేష్ బాబు సినిమా
Pooja Hegde and Karthi

గత కొన్ని రోజులుగా పూజ హెగ్డే తెలుగు సినిమా ఒకటి చేస్తోంది అంటూ వార్తలు వస్తూనే వున్నాయి. అయితే ఆమె నాగ చైతన్యతో చేస్తోంది అనే వార్త వైరల్ అయింది కూడా. కానీ పూజ హెగ్డే తెలుగు సినిమా చేస్తోంది అనే వార్త మాత్రం నిజం అని తెలిసింది, అయితే అది నాగ చైతన్యతో కాదని, తమిళ నటుడు కార్తీ తో అని తాజా సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో చిత్రీకరణ జరుగుతుందని, ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నిర్మాతగా చేస్తున్నారని కూడా తెలిసింది. (Suresh Babu to producer a bilingual with Pooja Hegde and Karthi as lead pair)

poojahegde-new1.jpg

ఒక కొత్త దర్శకుడు సురేష్ బాబుకి కథ చెప్పారని, ఆ కథ విని సురేష్ బాబు చాలా ఆసక్తికరం చూపించారని, అందుకు పూజ హెగ్డే అయితేనే బాగుంటుంది అని ఆమెకి కథ చెప్పడం జరిగిందని, ఆమెకి వెంటనే కథ నచ్చి ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారని తెలిసింది. ఈ సినిమాని రెండు భాషల్లో చేస్తే బాగుంటుంది అని అందుకు తమిళం, తెలుగులో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిన కార్తీ అయితే బాగుంటుంది అని అతన్ని సంప్రదించారని తెలిసింది.

sureshbabu.jpg

కార్తీ కూడా కథ విని చెయ్యడానికి సరే అన్నారని కూడా తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే జరగనుందని తెలుస్తోంది. ఈ సినిమా అధికారికంగా కొన్ని రోజుల్లో ప్రకటించే అవకాశాం ఉందని కూడా తెలుస్తోంది. సురేష్ బాబు, తన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. చాలా కాలం విరామం తరువాత పూజ హెగ్డే ఒప్పుకున్న తెలుగు సినిమా ఇదే అని కూడా తెలుస్తోంది.

Updated Date - Apr 30 , 2024 | 11:30 AM