Pooja Hegde: అరడజనుకు పైగా సినిమాలు వదులుకున్న పూజ హెగ్డే

ABN , Publish Date - Feb 12 , 2024 | 02:14 PM

తాజాగా విడుదలైన రవితేజ నటించిన 'ఈగల్' సినిమాతో సహా సుమారు ఆరు సినిమాలైకి పైగా సినిమాలు వదులుకున్న పూజ హెగ్డే, ఇప్పుడు ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్నట్టుగా తెలిసింది.

Pooja Hegde: అరడజనుకు పైగా సినిమాలు వదులుకున్న పూజ హెగ్డే
Pooja Hegde

అగ్రనటీమణుల్లో ఒకరైన పూజ హెగ్డే ఈమధ్య తెలుగు సినిమాలు ఎక్కువ చెయ్యడం లేదు, అలాగే తెలుగులో సినిమా చేసి కూడా సుమారు రెండు సంవత్సరాలకిపైగా అయింది. అయితే పూజ హెగ్డే కి తెలుగులో సినిమాలు రావటం లేదని, అందుకే ఆమె చెయ్యడం లేదని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. అయితే ఆమెకి సినిమాలు రావటం లేదు అనే విషయం కరెక్టు కాదని, ఆమెకి చాలా అవకాశాలు వచ్చాయని, అందులో ఆమె పాత్రలు నచ్చకపోవటంతో ఆమె వదులుకున్నారని ఆమె సన్నిహితులద్వారా తెలిసింది.

poojahegde-new1.jpg

పూజ హెగ్డే చివరి తెలుగు సినిమా చిరంజీవి నటించిన 'ఆచార్య', ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంత ప్రభావం చూపలేకయింది. అంతకుముందు ఆమె సినిమా 'అల వైకుంఠపురంలో' అనే సినిమా పరిశ్రమలో హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఆ తరువాత ఆమె సినిమాలు అంత ప్రభావం చూపలేకపోయాయి. కానీ పూజ హెగ్డేకి చాలా సినిమా అవకాశాలు వచ్చినా, ఆమె తన పాత్ర బాగుంటుంటేనే ఆ సినిమా చెయ్యడానికి సంసిద్ధత వ్యక్తం చేసారని తెలిసింది.

poojahegdenewone.jpg

గతవారం విడుదలైన రవితేజ నటించిన 'ఈగల్' సినిమాలో ముందుగా పూజ హెగ్డేని అడిగినట్టుగా తెలిసింది. అయితే ఆమె ఆ పాత్రని ఒదులుకున్నట్టుగా తెలిసింది. అంతకు ముందు ఆమె 'గుంటూరు కారం' కూడా చెయ్యాల్సింది, కానీ ఆ సినిమా బాగా డిలే అవటంతో ఆమె సినిమా నుండి తప్పుకున్నట్టుగా తెలిసింది. అలాగే ఇప్పుడు సంపత్ నంది, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా పూజ హెగ్డే పేరు ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. ఇక నీరజ కోన దర్శకురాలిగా సిద్ధూ జొన్నలగడ్డతో చేస్తున్న సినిమాలో కూడా ముందుగా పూజ హెగ్డే పేరునే సంప్రదించారని తెలిసింది. ఇంకో సినిమా వెంకీ అట్లూరి, దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా పూజ హెగ్డే నే ముందుగా అనుకున్నారు. ఇవి కాకుండా ఇంకో రెండు సినిమాలు కూడా పూజ హెగ్డే వదులుకున్నట్టుగా తెలిసింది.

poojahegdehot.jpg

పూజ హెగ్డే తన పాత్ర బాగుంటునే సినిమా చెయ్యాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిసిందే. ఒక మంచి తెలుగు సినిమాతో రావాలని పూజ హెగ్డే అనుకుంటున్నట్టుగా ఆమె సన్నిహితులు చెపుతున్నారు. ఆమెని ఇప్పటికీ చాలా సినిమాలకి సంప్రదింపులు చేస్తున్నారనీ, అందులో ఆమె పాత్ర నచ్చకపోవడంతో ఆమె సినిమాలు చెయ్యడం లేదని తెలిసింది. అలాగే రవితేజ రాబోయే సినిమాకి కూడా పూజ హెగ్డే ని సంప్రదించారని కూడా తెలిసింది. ఇలా సుమారు అరడజనుకి పైగా సినిమాలు వదులుకున్నట్టుగా తెలిసింది.

Updated Date - Feb 12 , 2024 | 06:27 PM