Pooja Hegde : ఆ కోరిక ఇప్పుడైనా తీరబోతోందా?

ABN , First Publish Date - 2023-10-07T10:22:01+05:30 IST

బుట్ట బొమ్మ పూజాహెగ్డే జిమ్‌లో విపరీతంగా కసరత్తులు చేస్తుంది. అయితే ఆమె ఇప్పుడు ప్రత్యేకంగా చేస్తుందేమీ కాదు. కానీ ఇంకొంచెం ఎక్కువ కష్టపడుతోంది. అందుకు కారణం లేకపోలేదు.

Pooja Hegde : ఆ కోరిక ఇప్పుడైనా తీరబోతోందా?

బుట్ట బొమ్మ పూజాహెగ్డే (pooja hegde)జిమ్‌లో విపరీతంగా కసరత్తులు చేస్తుంది. అయితే ఆమె ఇప్పుడు ప్రత్యేకంగా చేస్తుందేమీ కాదు. కానీ ఇంకొంచెం ఎక్కువ కష్టపడుతోంది. అందుకు కారణం లేకపోలేదు. పూజాకు యాక్షన్‌ కథలంటే ప్రాణం. ఆ తరహా కథల కోసం ఎంతోకాలంగా వేటలో ఉంది. అయితే అలాంటి అవకాశం ఇప్పటి వరకూ దక్కలేదు. కేవలం గ్లామర్‌ పాత్రలతోనే మెప్పిస్తూ దైసుకెళ్తోంది. పూరి జగన్నాథ్‌ ‘జనగణమన’లో యాక్షన్‌ పాత్ర చేేస అవకాశం దొరికినా.. ఆ చిత్రం ఆగిపోయింది. అయితే ఇప్పుడామె తన కలను నెరవేర్చుకునే పనిలో పడింది. ఇటీవల ఓ భారీ ప్రాజెక్ట్‌కు ఓకే చేసిందని సమాచారం. అందులో ఆమె పాత్ర పూర్తిగా యాక్షన జానర్‌లో ఉండబోతోందట, దీనికోసమే పూజ ప్రస్తుతం బాక్సింగ్‌, మిక్స్డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. జిమ్‌లో కఠిన కసరత్తులు చేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలో నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడబోతుందని పూజా సన్నిహితుల నుంచి సమాచారం. (pooja hegde action movie)

Pooja-hegde.gif

అయితే చూస్తుండగానే పూజాహెగ్డే తెలుగు ఇండసీ్ట్రలో అడుగుపెట్టి ఈ నెలతో పదేళ్లు పూర్తి కావొస్తుంది. ప్రారంభం ఫ్లాప్‌ సినిమాతోనే అయినా ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుని హిట్‌ అందుకుని టాలీవుడ్‌కు గోల్డెన లెగ్‌గా మారింది. ఆచార్య తర్వాత తెలుగులో మరో సినిమా అంగీకరించలేదు. ుగుంటూరు కారం’లో అవకాశం వచ్చినా డేట్స్‌ క్లాష్‌ వల్ల ఈ చిత్రం నుంచి బయటకు వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది.

Pooja-3.gif

Updated Date - 2023-10-07T10:22:30+05:30 IST