అసలు ఊహించి ఉండదు.. అదృష్టమంటే ‘ఓజీ’ హీరోయిన్‌దే!
ABN, Publish Date - Apr 25 , 2026 | 10:46 AM
ప్రియంకా అరుల్ మోహన్.. ‘ఓజీ’ సినిమాతో తిరుగులేని స్టార్‌డమ్ అందుకున్న ఈ భామకు అదృష్టం మాములుగా పట్టలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త ఇబ్బంది పడినా, ఆ తర్వాత పుంజుకుని సక్సెస్‌లను అందుకుంది.
ప్రియంకా అరుల్ మోహన్ (Priyanka Arul Mohan).. ‘ఓజీ’ (OG Movie) సినిమాతో తిరుగులేని స్టార్‌డమ్ అందుకున్న ఈ భామకు అదృష్టం మాములుగా పట్టలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త ఇబ్బంది పడినా, ఆ తర్వాత పుంజుకుని సక్సెస్‌లను అందుకుంది ప్రియాంకా మోహన్. ‘ఓజీ’ తర్వాత ఈ భామ నుంచి వచ్చిన ‘మేడ్ ఇన్ కొరియా’ (Made in Korea) చిత్రం.. ఆమెకు ఎనలేని గౌరవాన్ని తెచ్చిపెట్టింది. అదేంటని అనుకుంటున్నారా? భారత పర్యటనలో ఉన్న దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జె మ్యూంగ్ గౌరవార్థం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో ఇచ్చిన విందులో ప్రియాంకా మోహన్‌కు కూడా పాల్గొనే అవకాశం లభించింది. ఇది అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టుగా హీరోయిన్ ప్రియాంకా అరుల్ మోహన్ తన సంతోషాన్ని తెలియజేశారంటే, నిజంగా ఆమెకు లక్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. అసలు అంత మంది స్టార్ హీరోయిన్స్ ఉండగా ‘ఓజీ’లో ఈ భామనే సెలక్ట్ చేశారంటేనే తెలుస్తోంది.. అమ్మడి అదృష్టం ఏ రేంజ్‌లో ఉందనేది. ఆ అదృష్టం అలానే కంటిన్యూ అవుతూ.. అరుదైన గౌరవాన్ని ఆమెకు అందించింది.
ప్రియాంకా మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మేడ్ ఇన్ కొరియా’ అనే చిత్రం మార్చి 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై 13.5 కోట్ల వ్యూస్ అధిగమించి ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ ఆంగ్లేతర యూవీగా నిలిచింది. 54 దేశాల్లో విశేష ప్రేక్షకాదారణ పొందిన ఈ చిత్రం షూటింగ్ సింహభాగం సౌత్ కొరియాలోనే చిత్రీకరించారు. ఈ సినిమా సాధించిన సక్సెస్‌తో సంతోషంలో ఉన్న ప్రియాంకా మోహన్‌కు.. దేశ నేతలతో కలిసి విందు చేసే అవకాశం లభించడం మాములు విషయం కాదు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ మూడు రోజుల పర్యటనకు భారత్‌కు రాగా, ఆయన గౌరవార్థం రాష్ట్రపతి ఇటీవల ఉన్నతస్థాయి విందు ఇచ్చారు. ఇందులో భారత చలన చిత్ర పరిశ్రమ తరపున ప్రియాంకా మోహన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో కలిగిన అనుభూతిని తన ఇన్‌స్టా పేజీలో ప్రియాంకా పోస్ట్ చేస్తూ, ‘‘రాష్ట్రపతి భవన్‌లో ఒక మరుపురాని సాయంత్రం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు మ్యూంగ్ సమక్షంలో రాష్ట్రపతి ముర్ము ఇచ్చిన విందులో పాల్గొనడం నాకు దక్కిన అదృష్టం. ప్రపంచస్థాయి నేతలతో కలిసి విందు చేయడం గొప్ప అనుభవంగా భావిస్తున్నాను. ‘మేడ్ ఇన్ కొరియా’ చిత్రాన్ని వారు ప్రశంసించడం నన్ను ఎంతగానో కదిలించింది. నాలోని చిన్నారికి ఈ రోజు ఒక గొప్ప విజయం సాధించినట్టు అనిపించింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న కలలు, కఠోర శ్రమ, ఆశలు ఈ క్షణంలో నిశ్శబ్దంగా ప్రతిఫలిస్తున్నాయి. ఈ ప్రయాణాన్ని ఇంత ప్రత్యేకం చేసిన ‘మేడిన్ కొరియా’ చిత్ర బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
స్రవంతి చొక్కారపు.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో!
అందుకే చిరు.. ‘ఠాగూర్’ సినిమాపై రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘పెద్ది’ రిలీజ్ డేట్.. మరోసారి ‘లెనిన్’ త్యాగం చేయాల్సిందేనా!
తమన్నాతో బ్రేకప్.. మరో యంగ్ బ్యూటీని పట్టిన విజయ్ వర్మ!