Priyanka Arul Mohan: ఆయనకు ప్రజల గురించే ఆలోచన..

ABN , Publish Date - Aug 20 , 2024 | 11:43 AM

పవన్‌ కల్యాణ్‌, నాని ఇద్దరూ క్రియేటివ్‌గా ఉంటారు. నాని సినిమాల గురించి ఎప్పుడూ కలలు కంటారు. పవన్‌ ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తుంటారు అని ప్రియాంక ఆరుల్‌ మోహన్ అన్నారు.

"పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan), నాని ఇద్దరూ క్రియేటివ్‌గా ఉంటారు. నాని సినిమాల గురించి ఎప్పుడూ కలలు కంటారు. పవన్‌ ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తుంటారు’ అని ప్రియాంక ఆరుల్‌ మోహన్  (Pryanka arul mohan) అన్నారు. అగ్ర కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ఓజీ’ (OG)(ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌) చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తోంది. సుజీత్‌ (Sujith) దర్శకత్వంలో డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే నాని హీరోగా తెరకెక్కుతున్న ‘సరిపోదా శనివారం’ (Saripodha sanivaaram)చిత్రంలోనూ ప్రియాంక నాయికగా నటిస్తోంది. తాజాగా ఆమె మాట్లాడుతూ ‘ఓజీ లాంటి గొప్ప కథలో భాగం కావడం, పవన్ సర్‌ పక్కన నటించడం నా అదృష్టం. ఆ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. పవన్‌ కల్యాణ్‌, నాని ఇద్దరూ క్రియేటివ్‌గా ఉంటారు. నాని సినిమాల గురించి ఎప్పుడూ కలలు కంటారు. పవన్‌ ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తుంటారు’ అని అన్నారు.  ముంబయి - జపాన్‌ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో ఈ సినిమా సిద్థమవుతోంది. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి ప్రతినాయకుచి?గా నటిస్తున్నారు. అర్జున్‌ దాస్‌, వెంకట్‌, శ్రియారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Priyanka.jpg

చారులత చాలా ప్రత్యేకం..  

విడుదలకు సిద్ధంగా ఉన్న సరిపోదా శనివారం చిత్రంలో ప్రియాంక ఆరుల్‌ మోహన్  పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. దర్శకుడు వివేక్‌ ఆత్రేయ తీసింది మూడు చిత్రాలే అయినా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తెరకెక్కించిన మెంటల్‌ మదిలో, బ్రోచేవారెవరురా, అంటే సుందరానికీ.. ఈ మూడు చిత్రాలు దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ మూడు కథల్లో ఉన్న కామన పాయింట్‌ కథ అంతా హీరోయిన్‌ క్యారెక్టర్‌ చుట్టూ తిరగడమే! తాజాగా వివేక్‌ తెరకెక్కించిన ‘సరిపోదా శనివారం’లో కూడా హీరోయిన్‌ పాత్రే ఒక స్పెషల్‌ ఎలిమెంట్‌గా ఉంటుందని నాని ఇటీవల ఓ టీవీ షోలో తెలిపారు. ఇందులో ప్రియాంక పోలీస్‌ కానిేస్టబుల్‌ చారులత పాత్రలో  నటించింది. ఈ కథలో ఆమె పాత్రకు ఒక బ్యాక్‌ స్టోరీ వుంటుందట, మొత్తం కథని మలుపు తిప్పే పాత్ర చారులతదేనని నాని ఓ మ్యూజికల్‌ షోలో వెల్లడించారు. అయితే అంతకు మించి ఈ చిత్రం గురించి చిత్ర బృందం ఇంకేమీ రివీల్‌ చేయడం లేదు.  ట్రైలర్‌లో కూడా ఒక్క డైలాగ్‌కే పరిమితం చేశారు.  ఆగస్ట్‌ 29న ఈ సినిమా ప్రేక్షకు ముందుకు వస్తోంది. 

Nani.jpg

Updated Date - Jun 24 , 2025 | 01:21 PM