Priyanka Mohan: ప్రియాంక డీప్‌ఫేక్ ఫొటోలు.. మాజీ మేనేజర్ ప‌నేనా?

ABN , Publish Date - Oct 13 , 2025 | 10:07 AM

తమిళ, తెలుగు భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్.

Priyanka Mohan

తమిళ, తెలుగు భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan). గ‌త సంవ‌త్స‌రం స‌రిపోదా శ‌నివారం ఈయేడు ఓజీ (OG)తో అదిరిపోయే హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా డీప్‌ఫేక్ వీడియోలు, ఫొటో ఇష్యూలో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. ఓజీ సినిమాలో ఓ స‌న్నివేశం ఫొటోల‌ను అస‌భ్యంగా మార్చి నెట్టింట షేర్ చేయ‌డంతో తెగ వైర‌ల్ అయ్యాయి.

priyanka

అయితే ఈ విష‌యంలో ఆమె మాజీ మేనేజర్ హ‌స్తం ఉన్న‌ట్లు ఆయ‌నే కావాల‌ని ప్రియాంక‌ను టార్గెట్ చేశారంటూ ప్రచారం సాగుతోంది. గ‌తంలో.. ఒక అగ్ర నటుడి మేనేజర్ ప్రియాంకకు సైతం మేనేజర్‌గా ఉండేవాడు. కొన్ని రోజుల త‌ర్వాత‌ వారి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా ఆ మేనేజర్‌ను ప్రియాంక దూరం పెట్టింది. అప్పటి నుంచి ప్రియాంకపై కక్ష కట్టిన మాజీ మేనేజర్ ఆమె ఫొటోలను ఏఐ టెక్నాలజీ ద్వారా అసభ్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

Priyanka Mohan

ఈ ఫొటోలను చూసిన పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీటిపై ప్రియాంక మోహన్ (Priyanka Arul Mohan) స్పందిస్తూ.. ఏఐ ద్వారా సృష్టించిన అసభ్యకరమైన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి ఫొటోలను క్రియేట్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం ఆపండి. ఇలాంటి పసులకు దూరంగా ఉండాలి. మీరు ఏం క్రియేట్ చేస్తున్నారో ఒక సారి తెలుసుకుని, వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయండి' అని కోరారు.

Updated Date - Oct 13 , 2025 | 10:09 AM