Prakash Raj: మోదీ నాకూ ప్రధానే.. ఇలానే ప్రశ్నిస్తాను
ABN, Publish Date - Sep 21 , 2026 | 12:18 PM
ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలని విలక్షణ సినీనటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు.
ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) సారథ్యంలోని టీవీకే (TVK) ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలని విలక్షణ సినీనటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) అన్నారు. ఆదివారం తిరుచ్చిలో విమానాశ్రయం వద్ద ప్రకాశ్ రాజ్ విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు మార్పు కోసమే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని చెప్పారు. అందుకే ఈ ప్రభుత్వానికి కనీసం ఏడాది గడువు ఇవ్వాలని, అంతకుముందే తొందరపడటం భావ్యం కాదని పేర్కొన్నారు.
కొళత్తూరు నియోజకవర్గంలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఓడిపోవడం తనను షాక్‌కు గురిచేసిందని చెప్పారు. ఇపుడు కేంద్ర ప్రభుత్వం సైలెంట్ మోడ్‌లో ఉందని, వారి పతన సమయం ఆసన్నమైందని, వారి పాపం త్వరలోనే ఫలిస్తుందని వ్యాఖ్యానించారు.
నియోజ కవర్గాల పునర్విభజన బిల్లు పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, ఈ బిల్లులకు ఏ పార్టీ మద్దతు ఇచ్చినా తీవ్రంగా వ్యతిరేకించాలని పేర్కొన్నారు. 'నరేంద్ర మోదీ (PM Narendra Modi) అంటే ఇష్టం లేదు. ఆయనకు నేను ఓటువేయకపోయినా.. ఆయన నాకు కూడా ప్రధానమంత్రే. నేను ఆయనను ప్రశ్నిస్తాను' అని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
విజయ్‌తో వివాదంపై క్లారిటీ ఇచ్చిన విజయ్ సేతుపతి.. ఏం చెప్పారంటే?
వరంగల్ ఎయిర్ పోర్టుకు ‘సమ్మక్క-సారక్క’ పేరు పెట్టండి.. సీఎం పిలుపుకు దర్శకుడి స్పందన
పాపం 'స్వీటీ' ఏ స్థాయిలో ఉండే.. ఇప్పుడేమైపోయింది
Spirit: ప్రభాస్ ఊరమాస్ ట్రీట్.. థియేటర్లు ఇక ఊగి పోవాల్సిందే!
అప్పుడు వరుస డిజాస్టర్లైనా ఛాన్సులు.. ఇప్పుడు హిట్ పడినా పట్టించుకోవట్లేదు
Nani: ఇంకో 15 ఏళ్లు.. డూప్‌తో పనిలేదు
మళ్లీ ఏమైందిరా.. వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్
Vishwambhara Release: విశ్వంభరపై వశిష్ఠ పోస్ట్ వైరల్.. ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్
నాని.. ఇక లేదు గ్యాపు! రాబోయే రెండేళ్లు.. ఫుల్ ట్రీటు
రాజమౌళి సెంటిమెంట్.. ‘కుంభ’ బల పడతాడా లేక బలవుతాడా?