చరణ్‌పై పవన్ చూపిన ఆప్యాయత నన్నెంతో హత్తుకుంది: శివన్న

ABN , Publish Date - May 25 , 2026 | 11:48 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల మధ్య ఉన్న బాండింగ్ చూసి చాలా ముచ్చటేసిందని అన్నారు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. సోమవారం బెంగళూరులో జరిగిన ‘పెద్ది’ ఈవెంట్‌లో శివన్న స్పీచ్ హైలెట్ అవుతోంది.

Peddi Bangalore Event

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Mega Power Star Ram Charan)ల మధ్య ఉన్న బాండింగ్ చూసి చాలా ముచ్చటేసిందని అన్నారు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (Shiva Rajkumar). రామ్ చరణ్ హీరోగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేటైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌ను, మేకర్స్ ఓ రేంజ్‌లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం బెంగళూరులో గ్రాండ్ ప్రెస్ మీట్‌ను (Peddi Bangalore Event) టీమ్ నిర్వహించింది.


ఈ కార్యక్రమంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రామ్ చరణ్ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. తన తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు ఎంతో నిజాయితీగా పనిచేస్తూ వస్తున్నారు. తల్లిదండ్రులు, పవన్ కళ్యాణ్, అభిమానుల ఆశీర్వాదాలు ఆయనకు ఎప్పుడూ వుంటాయి. ఇటీవల ఓ వేడుకలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పక్కపక్కనే కూర్చున్నారు. చరణ్‌ని పవన్ ఆపుతున్న తీరు చూసి నాకు చాలా ముచ్చటేసింది. వారి మధ్య ఆప్యాయత నన్ను ఎంతగానో హత్తుకుంది. నాకు పునీత్‌తో ఉన్న అనుబంధం లాంటిదే. రామ్ చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది.


నిర్మాత సతీష్, దర్శకుడు బుచ్చిబాబు, రత్నవేలు.. అందరూ నాపై ఎంతో ప్రేమ, ఆప్యాయత చూపించారు. ‘పెద్ది’ సినిమాతో రామ్ చరణ్‌కు కచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని నేను నమ్ముతున్నాను. చిరంజీవి అంటే మనందరికీ ఎంతో అభిమానం. ఆయన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో నేను కూడా పాల్గొని రక్తదానం చేశాను. ప్రేక్షకులు చిరంజీవి కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు. అలాంటి ఆప్యాయతను నేను ఎక్కడా చూడలేదు. మన మధ్య భాషా భేదాలు లేవు. మంచి కళాకారులను మనం ఎప్పుడూ ప్రేమతో ఆదరిస్తాం. ఈ సినిమాలో ఒక పాత్ర ఉందని చెప్పగానే.. నేను వెంటనే చేస్తానని చరణ్‌కు చెప్పాను. బుచ్చిబాబు నా పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. తను చెప్పిన కథ ప్రతి ప్రేక్షకుడిని కచ్చితంగా కనెక్ట్ చేస్తుంది. ‘పెద్ది’ పాత్ర ప్రతి ఒక్కరి హృదయంలో నిలిచిపోతుంది. జూన్ 4 కోసం నేనూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ముగిసిన సమావేశం.. ఎగ్జిబిటర్స్ సమస్యలు విని చిరంజీవి ఆశ్చర్యం!

హరిరామజోగయ్య కుమారుడిపై గేయ రచయిత అనంత శ్రీరామ్ ఫిర్యాదు

10 కోట్ల బడ్జెట్.. 1000 కోట్ల కలెక్షన్స్?.. ఇది కదా సక్సెస్ అంటే?

Updated Date - May 25 , 2026 | 11:48 PM

Peddi Movie: 24 గంటల్లో ‘పెద్ది’ ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!

Peddi - Ram Charan:  పెద్ది కోసం రామ్ చరణ్ ఫిట్‌నెస్‌ మిషన్‌

Peddi Movie: ట్రైలర్‌లోని ఆ షాట్‌కు.. నీకు గుడి కట్టేయవచ్చు బుచ్చి!

Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్

Peddi Movie: రామ్ బుజ్జిగా దివ్యేందు శర్మ.. వీడియో వైరల్!