విజయ్‌కు ఆ టైటిల్ సరిగ్గా సెట్టయింది -‘జననాయగన్’ నిర్మాత
ABN, Publish Date - May 13 , 2026 | 09:46 PM
హీరో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్య పదవి అధిరోహించడంతో తాను నిర్మించిన చిత్రానికి ‘జననాయగన్’ టైటిల్ పెట్టడం సరిగ్గా సరిపోయిందని ఆ చిత్ర నిర్మాత వెంకట్ కె. నారాయణ అన్నారు.
హీరో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రజాస్వామ్య పదవి అధిరోహించడంతో తాను నిర్మించిన చిత్రానికి ‘జననాయగన్’ (Jana Nayagan) టైటిల్ పెట్టడం సరిగ్గా సరిపోయిందని ఆ చిత్ర నిర్మాత వెంకట్ కె. నారాయణ (Venkat K. Narayana) అన్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ వివాదం కారణంగా విడుదలకు నోచుకోలేదు. అదే సమయంలో విజయ్ (Vijay) ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో నిర్మాత వెంకట్ కె.నారాయణ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘జననాయగన్’ టైటిల్ విజయ్‌కు సరిగ్గా సరిపోయింది. విజయ్‌తో కలిసి గత రెండేళ్ళుగా పనిచేస్తున్నాను. విజయ్‌ను చూసేందుకు, ఆరాధించేందుకు ప్రజలు థియేటర్లకు వస్తున్నారు. అలాంటి విజయ్ ఇపుడు సీఎంగా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. వెండితెరపై హీరోగా ఉన్న విజయ్‌ని నిజ జీవితంలోనూ ప్రజలు నాయకుడిని చేశారు. ప్రతి కుటుంబంలో ఒక విజయ్ అభిమాని ఉన్నా ఆశ్చపడాల్సిన అవసరం లేదు. ‘జన నాయగన్’ మూవీకి గత యేడాది డిసెంబరు నెలలో సెన్సార్ కోసం విన్నవించాం. ఇటీవలే సెన్సార్ రివైజింగ్ కమిటీ రివ్యూ చేసింది. త్వరలోనే సెన్సార్ సర్టిఫికెట్ వస్తుందని ఆశిస్తున్నానన్నారు. సెన్సార్ క్లియరెన్స్ రాగానే, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని అన్నారు.
మరో వైపు ఈ సినిమా ఎన్ని సమస్యలను ఫేస్ చేసిందో తెలియంది కాదు. సెన్సార్ ఇష్యూ నిమిత్తం నిర్మాత కోర్టుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు విజయ్ తమిళనాడు సీఎం కావడంతో.. ఈ సినిమా విడుదలకు అన్ని సమస్యలు ముగిసినట్టేనని భావించవచ్చు. ఈ సినిమా సమస్యలలో ఉన్నప్పుడు ఓటీటీ డీల్ కూడా దారుణంగా పడిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడది కూడా సెట్ అయిందని, అన్నింటికి కారణం విజయ్ సీఎం కావడమే అనేలా టాక్ నడుస్తోంది.
ఇవి కూడా చదవండి:
పరిష్కారం కోసమా? పరువు తీసుకోవడానికా?.. ఇండస్ట్రీ రచ్చపై మధుర శ్రీధర్
అప్పుడు ‘హరి హర వీరమల్లు’కి.. ఇప్పుడు ‘పెద్ది’కి! - మైత్రీ రవిశంకర్
Prabhas: ‘బాహుబలి’ ప్రభాస్ చేసిన ఈ పని తెలిస్తే.. ఫ్యాన్ అయిపోవాల్సిందే!
రాజీనామా.. నట్టి కుమార్ సంచలన నిర్ణయం