నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు: జయం రవికి భార్య ఆర్తి కౌంటర్!
ABN, Publish Date - May 18 , 2026 | 10:33 AM
తనను, తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తన భర్త రవి మోహన్ చేసిన ఆరోపణలపై ఆయన సతీమణి ఆర్తి ఎక్స్ వేదికగా స్పందించారు. ఆడ సింహంతో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ ఆమె రవికి హెచ్చరిక జారీ చేసింది.
తనను, తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తన భర్త రవి మోహన్ (Ravi Mohan) చేసిన ఆరోపణలపై ఆయన సతీమణి ఆర్తి (Aarti Ravi) ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ విషయంపై ఆమె చేసిన ట్వీట్‌లో.. ‘‘నిద్రపోతున్న సింహాన్ని ఎప్పుడూ లేపకూడదు. ముఖ్యంగా ఆడ సింహంతో మరింత జాగ్రత్తగా ఉండాలి. నా ఈ గౌరవప్రదమైన మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దు. అవసరమైతే నా పిల్లలను, నా గౌరవాన్ని కాపాడుకోవడానికి అనుభవిస్తున్న లగ్జరీ జీవితాన్ని త్యజించి బయటకు వచ్చి సాధారణ గృహిణిలా నన్ను, నా పిల్లలను పోషించుకుంటూ నిజాయితీగా జీవించగలను. ఎందుకంటే, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతోంది.
ఈ ట్వీట్‌కు ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) మద్దతు ప్రకటించి, ‘అమ్మతో ఎప్పుడూ పెట్టుకోకూడదు. నువ్వు నీ పిల్లలను కాపాడుకునే సింహానివి. నీకు ఇంకా ఎక్కువ శక్తి లభించాలి నా బంగారం’ అని పేర్కొన్నారు. తన వ్యక్తిగత జీవితం నాశనం కావడానికి మూడు అక్షరాల ఇడ్లీ నటి అంటూ రవి మోహన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆర్తి మోహన్‌కు ఖుష్బూ మద్దతు ఇవ్వడం గమనార్హం. రవి మోహన్ చెప్పిన ఇడ్లీ నటి ఖుష్బూనే అని అంతా ఫిక్సవుతున్నారు. దీంతో రవి, ఆర్తి జీవితంలో కలహాలకు ఖుష్బూ కూడా ఓ కారణమా? అనేలా నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఎప్పుడూ లేనిది రవి మోహన్ ప్రెస్ మీట్ నిర్వహించి, కంటతడి పెట్టుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. రెండేళ్లుగా తన భార్య నరకం చూపిస్తోందని మీడియా ముందుకు వచ్చి కంటతడి పెట్టుకుని మరీ తన బాధని వ్యక్తం చేసిన రవి మోహన్.. సోషల్ మీడియాలో జరుగుతున్న సైబర్ బుల్లియింగ్ చాలా దారుణమైన విషయమని, దీనివలన మనుషులు ప్రశాంతతను కోల్పోయి.. చావు వరకు వెళ్తారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తన ప్రాణ స్నేహితురాలు కెనీషా తన దూరమైందని బాధపడ్డారు. అంతేకాదు, మూడు అక్షరాల ఇడ్లీ నటి నా కుటుంబాన్ని నాశనం చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. ‘ఆ నటి ముగ్గురు నటుల జీవితాలను నాశనం చేయడానికే వచ్చిందని వాళ్లే నాకు చెప్పారు. ముగ్గురి జీవితాలను నాశనం చేయాలనుకున్న ఆ బొమ్మ నా జీవితం గురించి మాట్లాడుతోంది’ అంటూ రవి చేసిన కామెంట్స్‌తో కోలీవుడ్‌లో ఇది ఇప్పుడో వివాదంగా మారింది. ఇది ఎంత వరకు వెళుతుందనేది చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
కోహ్లీ కుస్తీ ఆడితే ఎలా ఉంటదో.. ‘పెద్ది’ ట్రైలర్‌పై నాగవంశీ
మేము అమ్మ, నాన్నలమయ్యాం: జబర్దస్త్ నటుడు ఎమోషనల్!
Mega158: మాస్ వర్కవుట్స్‌తో మెగా158 అప్డేట్.. చిరు వీడియో వైరల్!
Chiranjeevi: ‘పెద్ది’ ట్రైలర్ చూశా.. ఒక్కొక్కరు రఫ్ఫాడించేశారు!