scorecardresearch

Jayam Ravi - Aarti:15 ఏళ్ల బంధానికి స్వస్తి.. తొందరపాటు నిర్ణయం కాదు

ABN , Publish Date - Sep 09 , 2024 | 02:20 PM

నటుడు జయం రవి (jayam Ravi) సంచలన ప్రకటన చేశారు.  15 ఏళ్ల వివాహ బంధానికి ఆయన స్వస్తి పలికారు. భార్యతో విడాకులు తీసుకున్నట్లు తెలిపారు.

Jayam Ravi - Aarti:15 ఏళ్ల బంధానికి స్వస్తి.. తొందరపాటు నిర్ణయం కాదు



నటుడు జయం రవి (jayam Ravi) సంచలన ప్రకటన చేశారు.  15 ఏళ్ల వివాహ బంధానికి ఆయన స్వస్తి పలికారు. భార్యతో విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా రవి తన భార్య ఆర్తితో (Aarti)విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ విషయాన్ని వివరిస్తూ ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ఇద్దరం ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లు రవి నోట్‌లో తెలిపారు. ‘‘జీవితం ఎన్నో అధ్యాయాలతో నిండిన ప్రయాణం. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. మీలో చాలామంది నన్ను ఆదరించి నాకు మద్దతుగా నిలిచారు. అందుకే నేనెప్పుడు నా అభిమానులతో పారదర్శకంగా, నిజాయతీగా ఉంటాను. నేడు మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నా. ఈ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తోంది. ఎన్నో ఆలోచనలు, చర్చల తర్వాత నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం.  తొందరపాటుతో ఈ నిర్ణయం తీసుకోలేదు. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం. మాతో పాటు మా కుటుంబ సభ్యుల గోప్యతను గౌరవించాలని మీ అందరినీ కోరుతున్నాను. ఈ విషయంపై ఆరోపణలు మానేయాలని అందరినీ కోరుతున్నా, ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం కష్టపడతాను. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటా. ఎప్పటికీ ఇలానే సపోర్ట్‌ అందిస్తారని ఆశిస్తున్నా’ అని జయం రవి పేర్కొన్నారు. (Jayam Ravi and wife Aarti announce separation)

jayam-ravi.jpg
ప్రముఖ ఎడిటర్‌ మోహన్‌ కుమారుడైన రవి 2009లో ఓ టెలివిజన్‌ నిర్మాత కూతురు ఆర్తిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా కనిపించే వీరు ఉన్నట్లుండి విడాకులు తీసుకోవటం పరిశ్రమ వర్గాలకు షాక్‌ గురి చేసింది. ఆయన భార్య ఆర్తి విడాకుల ప్రకటనకు ముందే  ఇన్స్‌స్టాలో తమ పెళ్లి ఫోటోలు డిలీట్‌ చేసింది. దీంతో వారి డైవోర్స్‌ని ఆర్తి పరోక్షంగా కన్‌ఫామ్‌ చేసినట్లయింది.  కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు మొదటయ్యాయట. ఇరు కుటుంబ సభ్యులు నచ్చచెప్పడంతో వారి మధ్య వచ్చిన కలతలను తొలగించే ప్రయత్నం చేశారట. కానీ అది వర్క్‌ అవుట్‌ కాకపోవడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు సన్నిహితుల నుంచి సమాచారం. ఈ క్రమంలో కొన్ని నెలలుగ  జయం రవి, ఆర్తి విడివిడిగా జీవిస్తున్నారు. కాగా ఈరోజు జయం రవి తమ విడాకులను అధికారికంగా ప్రకటించారు. జయం రవి గతేడాది పాన్‌ ఇండియా మూవీ పొన్నియిన్‌ సెల్వన్‌తో నేషనల్‌ వైడ్‌గా గుర్తింపు పొందారు.

Updated Date - Sep 09 , 2024 | 03:50 PM