Jayam Ravi: న‌న్ను బ‌త‌క‌నివ్వండి.. భార్య‌పై జ‌యం ర‌వి తీవ్ర విమ‌ర్శ‌లు! లేఖ విడుద‌ల‌

ABN , Publish Date - May 15 , 2025 | 11:41 PM

జయం రవి మరోసారి వార్తలోకెక్కారు. త‌న భార్య‌తో దూరంగా ఉంటున్న ఆయ‌న ఇటీవ‌ల ఓ సింగ‌ర్‌తో ద‌ర్శ‌ణ‌మివ్వండంతో భార్య ఆర్తి ఓ లెట‌ర్ విడుద‌ల చేసింది. దానికి కౌంట‌ర్‌గా ర‌వి సైతం ఓ లేఖ రిలీజ్ చేశారు.

jayam

ప్ర‌ముఖ‌ తమిళ హీరో జ‌యం రవి (Jayam Ravi) గ‌త సంవ‌త్స‌రం తన భార్యతో విడిపోయిన సంగ‌తి అంద‌రికి తెల‌సిందే. ఆపై కోర్టు మెట్లు ఎక్కిన వారు విడాకుల కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ స‌మ‌యంలోనే ర‌వి ఓ ప్రముఖ సింగర్ (Kenishaa Francis) తో డేటింగ్‌లో ఉన్నాడనే వార్తలు బాగా ప్ర‌చారం అయ్యాయి కూడా. త‌ర్వాత అంతి స‌ద్దుమ‌ణిగి ప్ర‌శాంతంగా ఉంది అనుకుంటున్న స‌మ‌యంలో ఇటీవ‌ల ర‌వి ఆ సింగ‌ర్‌తో క‌లిసి ఓ పెళ్లికి హ‌జ‌రు కావ‌డంతో ర‌వి భార్య ఆర్తి విడాకుల వ్య‌వ‌హారం మ‌రోసారి హాట్ టాపిక్ అయింది.

Gqe44PnbcAUNTuV.jpg

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ వల్లనే జ‌యం రవి (Jayam Ravi) తన భార్యకు విడాకులు ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చిన నేప‌థ్యంలో ఈ విష‌య‌మై అప్ప‌ట్లో ర‌వి భార్య ఆర్తి (Aarti) బ‌హిరంగంగానే మాట్లాడారు. నాతో మాట్లాడ‌కుండా, నాకు చెప్పకుండానే ర‌వి మేం విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దీనంత‌టికి కార‌ణం ఫ‌లానా సింగ‌రే కార‌ణం అంటూ మండి ప‌డింది కూడా. తీరా ఇప్పుడు వారు జంట‌గా క‌లిసి క‌నిపించ‌డంతో మరోసారి ఈ జంట ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి ఆర్తి రవి (Aarti Ravi) సోషల్‌ మీడియాతో ఓ పోస్ట్‌ పెట్టారు.

GXBHO5ra0AAnt3_.jpg

‘గత ఏడాదిగా నేను ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉన్నా. నా కంటే నా పిల్లల ప్రశాంతతే నాకు ముఖ్యం అనుకున్నా. నాపై వచ్చిన ఆరోపణలు అన్ని భరించా. అంతమాత్రాన నా వైపు నిజం లేదని కాదు. ఈ రోజు ప్రపంచమంతా వారి ఫొటోలు చూసింది. మా విడాకుల ప్రాసెస్‌ ఇంకా కొనసాగుతోంది. కానీ, 18 ఏళ్లపాటు నాకు తోడుగా ఉన్న వ్యక్తి అలా చేశారు. కొన్ని నెలలుగా పిల్లల బాధ్యత నాపైనే ఉంది. ఆయన్నుంచి ఆర్థికంగానే కాదు నైతికంగానూ సపోర్ట్‌ లేదు. వాటికి తోడు ఇప్పుడు ఇంటి విషయంలో బ్యాంకు నుంచి సమస్య ఎదురైంది. అప్పుడు నేను లెక్కల కంటే ప్రేమకే విలువిచ్చా. ప్రేమ విషయంలో నేను బాధ పడటం లేదు. నా పిల్లలకు భద్రత అవసరం. నేను ఈరోజు ఓ భార్యగా, అన్యాయానికి గురైన మహిళగా కాదు పిల్లల శ్రేయస్సే లక్ష్యంగా ఉన్న తల్లిగా మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను మాట్లాడకపోతే.. వారికి భవిష్యత్తు ఉండదు. మీరు నిజాన్ని మార్చలేరు. తండ్రి అంటే టైటిల్‌ మాత్రమే కాదు అదో బాధ్యత. విడాకుల విషయంలో తుది తీర్పు వెలువడే వరకూ నా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఆర్తి రవిగానే ఉంటుంది. నేను ఏడవడం లేదు. అరవడం లేదు. ఇప్పటికీ నాన్నా అని నిన్ను పిలుస్తున్న పిల్లల కోసం నిలబడ్డా’ అని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఓ ర‌కంగా ర‌విపై, ఆయ‌న వ్య‌వ‌హార శైలిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.


అయితే.. తాజాగా ఆర్తి పెట్టిన పోస్టుపై ఇప్పుడు హీరో ర‌వి స్పందించి దాదాపు నాలుగు పేజీల లేఖ రిలీజ్ చేశాడు. భార్య త‌న‌పై చేసినఆరోపణలను ఖండించారు. అంతేకాకుండా నా వృత్తి రిత్యా బాహ్య ప్ర‌పంచానికి దూరంగా, మౌనంగా ఉంటున్నాన‌ని తెలిపారు. ఇంకా ఆయ‌న త‌న లెట‌ర్‌లో "నా గత వివాహ బంధాన్ని వ్యక్తిగత లాభం కోసం, సానుభూతిగా మార్చుకోవడాన్ని నేను అంగీక‌రించ‌ను, చ‌ట్ట ప్ర‌కారం చన‌డుచుకుంటాను, స‌త్యం ఎప్ప‌టికైనా గెలుస్తుందని అన్నారు. అంతేకాదు పెళ్లి అనంత‌రం త‌న భార్య‌తో ఉన్న‌న్ని రోజులు ఏదో పంజ‌రంలో ఉన్న‌ట్టు, క‌ట్టి వేయ‌బ‌డి ఉన్నా అని, మాన‌సికంగా, శారీర‌కంగా కూడా స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి వ‌చ్చిందని, చివ‌ర‌కు నా క‌న్న త‌ల్లిదండ్రుల‌ను క‌ల‌వ‌డానికి వీలు లేకుండా పోయింద‌ని, అయినా ఎంతో ఓర్పు హించి చివ‌రి వ‌ర‌కు క‌లిసి ఉండ‌డానికే ప్ర‌య‌త్నించాన‌ని ఇక ఆ టార్చ‌ర్ భ‌రించ‌లేక ఎంతో బాధ‌తో ఈ క‌ఠిన నిర్ణ‌యం తీసుకుని బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని, అన్ని ర‌కాల ఇబ్బందుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాన‌ని త‌న లెట‌ర్‌లో వ్రాసుకొచ్చారు.

1.jpg2.jpg3.jpg4.jpg

నాపై ఆర్తి చేస్తున్న కామెంట్ల‌న్నీ అవాస్త‌వాలేన‌ని, నేను ఎప్పుడు మాట‌మీదే నిల‌బ‌డ‌తాన‌ని, నాకు కోర్టులో న్యాయం జ‌రుగుతుంద‌నే న‌మ్మ‌కం ఉంద‌న్నారు. ఇద్ద‌రం విడిగా ఉంటున్న‌ప్ప‌టి నుంచి ఆర్తి పిల్ల‌ల‌ను త‌న ద‌గ్గ‌రే పెట్టుకుని కావాల‌ని నా ద‌గ్గ‌రకు రాకుండా నాకు దూరం చేస్తుంద‌ని, న‌న్ను క‌ల‌వనీయ‌డం లేద‌ని వాపోయాడు. అంతేగాక పిల్ల‌ను సాకుగా పెట్టి ప‌బ్లిక్‌లో సానుభూతి కోసం ప్ర‌య‌త్న చేస్తోంద‌ని, అర్థికంగానూ స‌మ‌స్య‌లు తీసుకువ స్తుంద‌ని అన్నారు. ఇన్నాళ్లు ప‌క్క‌నే ఉంటూ పెట్టిన ఇబ్బందులు చాలు.. న‌న్ను నాలా ఉండ‌నివ్వండి, బ‌త‌క‌నివ్వండి.. ఇదే నా మొద‌టి, అఖ‌రి ఉత్త‌రం అంటూ ముగించాడు. ఇలా ఉత్త‌ర ప్ర‌త్యుత్త‌రాల‌తో స‌మ‌స్య రోజురోజుకు జ‌ఠిలం అవుతుండ‌డంతో ఈ వివాదం ఎప్ప‌టికీ కొలిక్కి వ‌చ్చేనో అని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు.

Updated Date - May 15 , 2025 | 11:41 PM