Jayam Ravi - Kenisha: కెనీషాతో జయం రవి పెళ్లైపోయిందటూ.. ఫొటోలు వైరల్‌..

ABN , Publish Date - Jun 06 , 2025 | 05:50 PM

జయం రవి(jayam Ravi), ఆర్తిల (Aarti) పేర్లు కొద్ది రోజులుగా నెట్టింట వైరల్‌గా మారాయి. కోలీవుడ్‌ నటుడడు జయం రవి, సింగర్‌ కెనీషాను పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకే ఆర్తికి విడాకులు ప్రకటించారని వార్తలు గత కొద్దిరోజులుగా హల్‌చల్‌ చేస్తున్నాయి.


జయం రవి(jayam Ravi), ఆర్తిల (Aarti) పేర్లు కొద్ది రోజులుగా నెట్టింట వైరల్‌గా మారాయి. కోలీవుడ్‌ నటుడడు జయం రవి, సింగర్‌ కెనీషాను పెళ్లి చేసుకోబోతున్నారని, అందుకే ఆర్తికి విడాకులు ప్రకటించారని వార్తలు గత కొద్దిరోజులుగా హల్‌చల్‌ చేస్తున్నాయి. దానికి తగ్గట్టే రవి, కెనీషాల (Keneesha) తీరూ ఉంది. ఫంక్షన్‌కు కలిసి వెళ్లడం, ప్రత్యేకంగా కనిపించడంతో అది నిజమేనని కోలీవుడ్‌ కోడై కూస్తోంది. తాజాగా మరోసారి రవి, కెనీషా వార్తలో నిలిచారు. తన సొంత నిర్మాణ సంస్థ లోగోను ఆవిష్కరించే క్రమంలో ఇద్దరూ పువ్వుల దండలతో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకేసారి ఇద్దరూ దండలతో కనిపించడంతో అదీ దేవాలయం ముందు కావడంతో ఇద్దరూ పెళ్లి చేసేసుకున్నారా అనే చర్చ మొదలైంది. హీరో జయం రవి తన సొంత నిర్మాణ సంస్థ ‘రవి మోహన్‌ స్టూడియోస్‌’ లోగోను గురువారం సోషల్‌ మీడియా వేదికగా ఆవిష్కరించారు. దీనికి ముందు ఆయన సింగర్‌ కెనీషాతో కలిసి చెన్నైలోని మురుగన్‌ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు వీరికి స్వాగతం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదాశీర్వచనం ఇచ్చి ఫొటోలు తీసుకున్నారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.  ఇద్దరి మెడలో పూల దండలు కనిపించడంతో ఆ పక్కనే అర్చకులు కూడా ఉండడంతో చర్చనీయాంశమైంది. వీరిద్దరూ ‘పెళ్లి చేసుకున్నారా? అంటూ సందేహాలు మొదలయ్యాయి. మరి కొందరైతే పూజా కార్యక్రమాల్లో భాగంగా ఇలా కనిపించారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.  

ravi mohan.jpeg
జయం రవి తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు గతేడాది ప్రకటించారు. అయితే.. తనను సంప్రదించకుండానే ఈ ప్రకటన చేశారంటూ ఆర్తి రవి ఆరోపించారు. విడాకుల కేసు ఇంకా కోర్టులోనే ఉందని స్పష్టం చేశారు. అయితే, సింగర్‌ కెనీషాతో రిలేషన్‌ వల్లే ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చారంటూ అటు కోలీవుడ్‌ ఇటు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఇద్దరూ కలిసి కనిపించడం ఈ వార్తలకు  బలాన్ని చేకూర్చింది. ఈ విషయంపై ఆర్తి కూడా స్పందించారు. పిల్లల్ని పట్టించుకోకుండా ఆయన ఇలా చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. తాము విడిపోవడానికి పవర్‌, మనీ కారణం కాదని.. మూడో వ్యక్తే కారణమని చెప్పారు.  
 
    

Updated Date - Jun 06 , 2025 | 11:28 PM