సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తల లేని మొండెంతో.. ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్ అదిరింది

ABN, Publish Date - Oct 21 , 2026 | 07:15 PM

‘‘క్రైమ్‌ను ఫాలో అయితే జరిగింది మాత్రమే తెలుస్తుంది.. కానీ క్రిమినల్‌ని ఫాలో అయితే జరగబోయేది కూడా తెలుస్తుంది’’ అంటూ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్టర్ నరేష్ అగస్త్య.

Rudravanam PS

‘‘క్రైమ్‌ను ఫాలో అయితే జరిగింది మాత్రమే తెలుస్తుంది.. కానీ క్రిమినల్‌ని ఫాలో అయితే జరగబోయేది కూడా తెలుస్తుంది’’ అంటూ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు యంగ్ అండ్ ప్రామిసింగ్ యాక్టర్ నరేష్ అగస్త్య (Naresh Agastya). ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మినీ సిరీస్ ‘రుద్రవనం పీఎస్’ (Rudravanam PS). ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’ ఒరిజినల్‌గా రాబోతున్న ఈ 7 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని విడుదలైన ఈ సిరీస్ ట్రైలర్ ఆద్యంతం ఒళ్లు గగుర్పొడిచే సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.


ట్రైలర్‌ను గమనిస్తే (Rudravanam PS Trailer Review).. ఆరంభం నుంచే ఉత్కంఠను రేకెత్తిస్తూ ఈ ట్రైలర్ సాగింది. రుద్రవనం పరిధిలోని అటవీ ప్రాంతంలో తల లేని ఒక గుర్తుతెలియని మృతదేహం లభ్యమవుతుంది. అది క్షుద్రపూజల వల్ల జరిగిన హత్యా? లేక కక్షలతో చేసిన ఘాతకమా? అనే అనుమానాలు మొదలవుతాయి. సరిగ్గా అదే సమయంలో సంవత్సర కాలం క్రితం కూడా ఇలాంటి ఘటనే జరిగిందనే షాకింగ్ నిజం బయటపడుతుంది. మరోవైపు ఒక వ్యక్తి అదృశ్యం కావడం, అదే రోజు రాత్రి రూ. 25 లక్షల విలువైన బంగారం దొంగతనం జరగడం కేసును మరింత జటిలం చేస్తాయి. ఈ కేసుల చిక్కుముడులను విప్పేందుకు ఎస్ఐ శివకుమార్ (నరేష్ అగస్త్య) రంగంలోకి దిగుతాడు. పై అధికారుల నుంచి ఒత్తిడి, మరో వారం రోజుల్లోగా తల ఎక్కడుందో కనిపెట్టి కేసును క్లోజ్ చేయాలనే డెడ్‌లైన్ ఎదురవుతుంది. ఈ క్రమంలో వాడు చంపింది ఒక్కడినే కాదు.. ఏకంగా ఎనిమిది మందిని చంపిన సైకో కిల్లర్ అనే భయంకరమైన కోణం వెలుగులోకి వస్తుంది. స్థానిక రాజకీయాలు, గ్రామంలో ఏళ్ల తరబడి దాగి ఉన్న చీకటి రహస్యాలను ఛేదిస్తూ సాగే శివకుమార్ పోరాటం వ్యక్తిగత యుద్ధంగా ఎలా మారిందనేది ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు.


శ్రీచక్ర మూవీస్ బ్యానర్‌పై దర్శకుడు శశిధర్ మున్నంగి తెరకెక్కించిన ఈ సిరీస్‌కు తాజ్ సయ్యద్ అందించిన కథ, సంభాషణలు చాలా పదునుగా ఉన్నాయి. ముఖ్యంగా నరేష్ అగస్త్య చెప్పే ఇన్వెస్టిగేషన్ డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. అష్కర్ అలీ కెమెరా పనితనం విజువల్స్‌లో రస్టిక్ అండ్ డార్క్ మూడ్‌ను అద్భుతంగా ఎలివేట్ చేసింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ ఉత్కంఠను రెట్టింపు చేసింది. ఈ సిరీస్‌లో నరేష్ అగస్త్యతో పాటు సీనియర్ నటుడు బెనర్జీ, శివ ఆలపాటి, సుగాలి సులోని, రమేష్ కోనంబొట్ల, నారాయణ స్వామి, శివాని రెడ్డి, చారు, ప్రీతి సుందర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ఊహకందని ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో వచ్చిన ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ప్రియులను ఎంతగానో మెప్పించే అవకాశం ఉందనిపిస్తోంది. చూద్దాం మరి.. ఈ 7 ఎపిసోడ్ల మినీ సిరీస్ ఓటీటీ వీక్షకులకు ఎలా మెప్పిస్తుందో..

ఇవి కూడా చదవండి:

పెద్ద సినిమాలు ఉన్నప్పుడు చిన్న సినిమాలు వస్తే.. జరిగేది ఇదే

హద్దుల్లో ఉండండి: బాడీ షేమింగ్ ట్రోలర్స్‌పై పాయల్ రాజ్‌పుత్ ఫైర్

‘రౌడీ అల్లుడు’కు 35 ఏళ్ళు.. గీతా ఆర్ట్స్‌లో సంబరాలు

Updated Date - Oct 21 , 2026 | 07:15 PM