హద్దుల్లో ఉండండి: బాడీ షేమింగ్ ట్రోలర్స్‌పై పాయల్ రాజ్‌పుత్ ఫైర్
ABN , Publish Date - Oct 21 , 2026 | 05:42 PM
టాలీవుడ్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియా వేదికగా అసభ్యకర కామెంట్స్ చేసే ట్రోలర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టాలీవుడ్ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) సోషల్ మీడియా వేదికగా అసభ్యకర కామెంట్స్ చేసే ట్రోలర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆర్ఎక్స్ 100’ (RX100) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ‘వెంకీ మామ’, ‘మంగళవారం’ వంటి చిత్రాల్లో విభిన్నమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పాయల్.. ఇటీవల తన బాడీ షేప్‌ను టార్గెట్ చేస్తూ నెట్టింట కొందరు చేస్తున్న వల్గర్ ట్రోలింగ్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. తన తాజా వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, అసభ్యకరమైన రీతిలో కామెంట్లు, అసభ్యకర ఎమోజీలు పెడుతున్న వారిపై పాయల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
‘‘మీలాంటి వారిని చూస్తే సిగ్గేస్తోంది! నా శరీర రూపాన్ని ప్రస్తావిస్తూ ఆ వీడియోలను షేర్ చేస్తూ, అసహ్యకరమైన కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికీ సిగ్గుండాలి. ఇది నా శరీరం.. నా సైజ్.. నా గర్వం. నా శరీరం మీ డిబేట్‌లకు, మీ చెత్త అభిప్రాయాలకు లేదా మీ అసభ్యతకు చర్చనీయాంశం కాదు. మీ హద్దుల్లో మీరు ఉండండి.. మీ పనేదో మీరు చూసుకోండి!’’ అంటూ హెచ్చరించారు. ఈ పోస్టుకు #BodyShaming, #ShameOnYou అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేశారు.
సినిమాల్లో కాస్త గ్యాప్ వచ్చినప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటారు పాయల్. అయితే సినీ తారల రూపాన్ని, బరువును ఎగతాళి చేస్తూ బాడీ షేమింగ్‌కు పాల్పడటం ఇటీవల నెట్టింట కొందరికీ అలవాటుగా మారింది. ఈ తరుణంలో నటీమణుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించే ట్రోలర్లకు పాయల్ రాజ్‌పుత్ ఇచ్చిన ఘాటైన సమాధానానికి సినీ ప్రేమికులు, నెటిజన్లు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు. పాయల్ చూపించిన ధైర్యాన్ని అభినందిస్తూ.. ‘‘ఎవరి శరీర స్వభావం వారిష్టం, అసభ్య కామెంట్స్ ఆపండి’’, ‘‘ఇలాంటి కామెంట్స్ చేసే సమయంలో మీ ఇంట్లో వారిని ఊహించుకోండి’’ అంటూ పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
‘రౌడీ అల్లుడు’కు 35 ఏళ్ళు.. గీతా ఆర్ట్స్‌లో సంబరాలు
టాలీవుడ్ మేకర్స్‌పై రాహుల్ రామకృష్ణ సెటైరికల్ పోస్ట్
తలైవర్ మ్యాజిక్కే వేరు: ‘జైలర్ 2’ సక్సెస్‌పై నెల్సన్