దేవుళ్లనే నమ్ముకున్న ఆది.. మొన్న శంబాల.. నేడు రుద్ర
ABN , Publish Date - Oct 20 , 2026 | 05:57 PM
కెరీర్ ప్రారంభంలోనే లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ నటుడు ఆది సాయికుమార్ (Aadi Saikumar). కొన్నాళ్లు వరుస పరాజయాలతో కాస్త నెమ్మదించినప్పటికీ, గతేడాది శంబాల అనే మిస్టిక్ థ్రిల్లర్‌తో మళ్లీ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు.
కెరీర్ ప్రారంభంలోనే లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ నటుడు ఆది సాయికుమార్ (Aadi Saikumar). కొన్నాళ్లు వరుస పరాజయాలతో కాస్త నెమ్మదించినప్పటికీ, గతేడాది శంబాల అనే మిస్టిక్ థ్రిల్లర్‌తో మళ్లీ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తరువాత ఏరి కోరి కథలను ఎంచుకుంటున్న ఆది.. శంబాల జోనర్ లోనే మరో సినిమాని పట్టాలెక్కించాడు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఇంటెన్స్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ సినిమాకు రుద్ర అనే శక్తివంతమైన టైటిల్ ని ఖరారు చేశారు. ఈ వినూత్న చిత్రానికి నవర్రసన్ దర్శకత్వం వహిస్తుండగా, ప్రశాంత్, రుద్రప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి మరో ప్రధాన బలం సంగీతం. కన్నడ సంచలన చిత్రం కాంతార కి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలతో ప్రాణం పోసిన ప్రఖ్యాత సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించడం విశేషం.
తాజాగా విడుదల చేసిన పోస్టర్ డిజైన్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఆది సాయికుమార్ శత్రువులకు వెన్నుచూపని వీరుడిలా వీపు భాగం వైపు నుంచి కనిపిస్తూ, చేతిలో పదునైన శూలాన్ని పట్టుకుని నిలబడ్డాడు. ఆయన ఎదురుగా ఒక ధర్మచక్రం లాంటి ఆకారం, దానికి అవతల ఊరి ప్రజలు భయంతో చూస్తుండగా.. ఆకాశంలో విశ్వాన్నే ఆవహించినట్లుగా ఉన్న భద్రకాళి అమ్మవారి భీకర రూపం పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఒక్క పోస్టర్‌తోనే సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో మేకర్స్ స్పష్టం చేశారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కి సిద్ధమవుతోంది. శంబాల తర్వాత ఆది సాయికుమార్ మరో దేవుడిని నమ్ముకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ఆది మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.