స్పిరిట్ పోయింది.. ఎల్లమ్మ వచ్చింది

ABN , Publish Date - Oct 20 , 2026 | 08:28 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ స్పిరిట్ (Spirit) పై అభిమానులు ఎన్ని అంచనాలను పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Yellamma

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ స్పిరిట్ (Spirit) పై అభిమానులు ఎన్ని అంచనాలను పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొట్ట మొదటిసారి ప్రభాస్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొదటి నుంచి స్పిరిట్ వచ్చే ఏడాది మార్చి 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో వేసవి నుంచి దీపావళికి సినిమాను వాయిదా వేశారు.


ఇక స్పిరిట్ తప్పుకోవడంతో మార్చి 5 బాక్సాఫీస్ స్లాట్ ఖాళీ అయింది. ఈ బిగ్ డేట్‌ ని తెలివిగా సొంతం చేసుకున్నాడు దిల్ రాజు. ఆయన నిర్మిస్తోన్న చిత్రాల్లో ఎల్లమ్మ ఒకటి. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ బలగం దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న రూటెడ్ రస్టిక్ డ్రామా స్పిరిట్ డేట్ ని లాక్ చేసుకుంది. తాజాగా ఎల్లమ్మ పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసారు మేకర్స్.


ప్రభాస్ స్పిరిట్ ఈ డేట్ నుంచి తప్పుకున్నప్పటికీ, సినిమా ప్రేక్షకులకు మాత్రం మరో సాలిడ్ ట్రీట్ బిగ్ స్క్రీన్లపై రాబోతోందని చెప్పొచ్చు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వయంగా సంగీతం అందిస్తుండగా, పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమాను అత్యంత గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ప్రభాస్ డేట్ ని లాక్ చేసుకున్న ఎల్లమ్మ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - Oct 20 , 2026 | 08:32 PM