Peddi OTT: ఓటీటీలోనూ ‘పెద్ది’ ఊచకోత బ్యాటింగ్‌

ABN , Publish Date - Jul 10 , 2026 | 07:51 PM

థియేట్రికల్ రన్ ముగించుకుని ఓటీటీలోకి వచ్చిన ‘పెద్ది’.. ఇక్కడ కూడా మాస్ బ్యాటింగ్ మొదలెట్టాడు. అవును, ‘పెద్ది’ ఊచకోత బ్యాటింగ్‌‌తో నెట్‌ఫ్లిక్స్ సంస్థ పండగ చేసుకుంటోంది.

Peddi OTT Response

థియేట్రికల్ రన్ ముగించుకుని ఓటీటీలోకి వచ్చిన ‘పెద్ది’ (Peddi Movie).. ఇక్కడ కూడా మాస్ బ్యాటింగ్ మొదలెట్టాడు. అవును, ‘పెద్ది’ ఊచకోత బ్యాటింగ్‌‌తో నెట్‌ఫ్లిక్స్ (Netflix) సంస్థ పండగ చేసుకుంటోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా నటించిన ‘పెద్ది’ చిత్రం థియేటర్లలో రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి.. సంచలన విజయాన్ని నమోదు చేసింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించగా.. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పించాయి. గురువారం (జూలై 9) నుంచి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చి సాలిడ్ రెస్పాన్స్‌తో దూసుకెళుతోంది.


ఆల్రెడీ సినిమాను థియేటర్లలో చూసిన వారు కూడా, ఓటీటీలో మళ్లీ చూసేందుకు ఎగబడుతున్నారు. కారణం, ఇందులో యాడ్ చేసిన సీన్సే. అలాగే థియేటర్లలో మిస్ అయిన వారు, రామ్ చరణ్ నటనకు ఫిదా అవుతున్నారు. ఓటీటీలో ఈ సినిమా చూసిన వారంతా, సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ.. రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కొత్తగా యాడ్ చేసిన సీన్లతో ‘పెద్ది’ని ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తెచ్చారు. ఈ వారం ఓటీటీ వీక్షకులందరికీ ‘పెద్ది’ ఫుల్ మీల్స్‌‌ని ఇవ్వనుంది. ఇప్పటికే వస్తోన్న రెస్పాన్స్‌కు నెట్‌ఫ్లిక్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేసింది.


అంటే.. ‘పెద్ది’గాడి ర్యాంపేజ్ ఓటీటీలోనూ కంటిన్యూ అవుతోందన్నమాట. థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అయిన ఈ చిత్రం ఓటీటీలోనూ అదే రేంజ్‌లో రెస్పాన్స్‌ను రాబడుతుండటంతో.. ఇక్కడ కూడా సరికొత్త రికార్డులను ‘పెద్ది’ క్రియేట్ చేస్తాడంటూ.. అప్పుడే అభిమానులు హడావుడి చేయడం మొదలెట్టారు. చూద్దాం.. ‘పెద్ది’గాడి ఊచకోత ఇక్కడెలా ఉంటుందో. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటివారు ఇతర కీలక పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి:

2026: జనవరి టు జూలై.. కర్ణాటకలో హయ్యస్ట్ గ్రాసర్ చిత్రాలివే..

టాక్సిక్.. బాబోయ్ రెమ్యునరేషన్స్‌కే రూ. 100 కోట్లకు పైగా..!

Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ

I, Nobody: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌... ఐ, నోబడీ మూవీ రివ్యూ

Updated Date - Jul 10 , 2026 | 07:51 PM

Peddi Review: రామ్‌చరణ్‌ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రం 'పెద్ది’ ఎలా ఉందంటే..

Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్

Peddi Song: ‘చికిరి’ పాట కోసం రెహమాన్‌ ఎవర్ని దింపారంటే..

Peddi - Ram Charan:  పెద్ది కోసం రామ్ చరణ్ ఫిట్‌నెస్‌ మిషన్‌

Peddi Song: ‘పెద్ది సాంగ్‌.. బుచ్చి భలే ప్లాన్‌ చేశాడు..