2026: జనవరి టు జూలై.. కర్ణాటకలో హయ్యస్ట్ గ్రాసర్ చిత్రాలివే..
ABN , Publish Date - Jul 10 , 2026 | 04:47 PM
బాక్సాఫీస్ బెంచ్ మార్క్‌లు మారుతున్నాయి.. లాంగ్వేజ్ బారియర్స్ చెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఏ ప్రాంతంలో ఆ లోకల్ సినిమాలే రాజ్యమేలేవి. కానీ ఇప్పుడు కంటెంట్ బాగుంటే చాలు ఏ భాషా చిత్రమైనా సరే వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.
బాక్సాఫీస్ బెంచ్ మార్క్‌లు మారుతున్నాయి.. లాంగ్వేజ్ బారియర్స్ చెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఏ ప్రాంతంలో ఆ లోకల్ సినిమాలే రాజ్యమేలేవి. కానీ ఇప్పుడు కంటెంట్ బాగుంటే చాలు ఏ భాషా చిత్రమైనా సరే వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. 2026 ప్రథమార్ధం (జనవరి నుంచి జూన్ అండ్ జూలై వరకు) ముగిసేసరికి కర్ణాటక బాక్సాఫీస్ దగ్గర వివిధ సినీ ఇండస్ట్రీల పరంగా ఏయే సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించాయో ఓ లుక్కేద్దాం. ట్రేడ్ వర్గాల నుంచి అందిన తాజా రిపోర్ట్స్ ప్రకారం కర్ణాటక (Karnataka)లో ఇండస్ట్రీల వారీగా టాప్ ప్లేస్‌లో నిలిచిన చిత్రాలు, వాటి కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
1. ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) - రూ. 134 కోట్లు
ఈ ఏడాది కర్ణాటక బాక్సాఫీస్ వద్ద అందరినీ ఆశ్చర్యపరిచేలా చేసిన బాలీవుడ్ క్రేజీ యాక్షన్ ఎపిక్ ‘ధురంధర్ 2’. సాధారణంగా కర్ణాటకలో హిందీ సినిమాలకు మెట్రో సిటీస్ వరకే మార్కెట్ ఉంటుంది. కానీ ఈ చిత్రం ‘బాహుబలి 2’ రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ కేవలం కర్ణాటకలోనే ఏకంగా రూ. 134 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్-టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. 2026లో ఇప్పటివరకు కర్ణాటకలో ఇదే అత్యధిక కలెక్షన్.
2. ‘పెద్ది’ (Peddi)- రూ. 31.28 కోట్లు
టాలీవుడ్ నుంచి భారీ అంచనాల మధ్య విడుదలైన 'పెద్ది' చిత్రం కర్ణాటకలో తెలుగు సినిమా సత్తాను చాటింది. ఇక్కడి మాస్ ఆడియన్స్‌కు ఈ చిత్రం విపరీతంగా కనెక్ట్ కావడంతో రూ. 31.28 కోట్ల వసూళ్లతో టాలీవుడ్ వైపు నుంచి నంబర్ వన్ గ్రాసర్‌గా నిలిచింది.
3. ‘కేడీ: ది డెవిల్’ (KD: The Devil)- రూ. 31 కోట్లు
యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా హీరోగా, డైరెక్టర్ ప్రేమ్ కాంబినేషన్‌లో వచ్చిన 70ల నాటి అండర్‌వరల్డ్ డ్రామా ‘కేడీ: ది డెవిల్’ లోకల్ మార్కెట్‌లో దుమ్ములేపింది. సంజయ్ దత్, శిల్పా శెట్టి, కిచ్చా సుదీప్ వంటి భారీ తారాగణంతో వచ్చిన ఈ కన్నడ చిత్రం కర్ణాటకలో రూ. 31 కోట్లు రాబట్టి ఓన్ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది.
4. ‘కరుప్పు’ (Karuppu)- రూ. 23.62 కోట్లు
తమిళ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన పవర్‌ఫుల్ రూరల్ డ్రామా ‘కరుప్పు’ కర్ణాటకలోని తమిళ ఆడియన్స్‌తో పాటు లోకల్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్‌తో ఈ సినిమా రూ. 23.62 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి కోలీవుడ్ నుంచి టాప్ గ్రాసర్ ప్లేస్‌ని సొంతం చేసుకుంది.
5. ‘అబ్సెషన్’ (Obsession)- రూ. 23.5 కోట్లు
బెంగళూరు వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో హాలీవుడ్ సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఏడాది వచ్చిన మైండ్ బెండింగ్ థ్రిల్లర్ ‘అబ్సెషన్’ కర్ణాటక మల్టీప్లెక్స్‌లలో కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం రూ. 23.5 కోట్ల మార్కును అందుకోవడం విశేషం.
6. ‘దృశ్యం 3’ (Drishyam 3)- రూ. 14.22 కోట్లు
మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మోస్ట్ అవైటెడ్ క్లాసిక్ సస్పెన్స్ థ్రిల్లర్ సీక్వెల్ ‘దృశ్యం 3’ కర్ణాటకలో మలయాళ సినిమాల్లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. మోహన్ లాల్ నటన, ఆసక్తికరమైన క్లైమాక్స్ ట్విస్టులతో ఈ చిత్రం రూ. 14.22 కోట్లు వసూలు చేసింది.
2026 మొదటి ఏడు నెలల్లో కర్ణాటక బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్ 2’ ఊహించని రేంజ్‌లో నంబర్ వన్ స్థానంలో నిలవగా.. సౌత్ ఇండస్ట్రీల నుంచి ‘పెద్ది, ‘కేడీ: ది డెవిల్, కరుప్పు’ చిత్రాలు గట్టి పోటీని ఇచ్చాయి. ఇక ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మరిన్ని భారీ చిత్రాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈ రికార్డులను ఎవరు బద్దలు కొడతారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
టాక్సిక్.. బాబోయ్ రెమ్యునరేషన్స్‌కే రూ. 100 కోట్లకు పైగా..!
Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ
I, Nobody: పృథ్వీరాజ్ సుకుమారన్... ఐ, నోబడీ మూవీ రివ్యూ