టాక్సిక్.. బాబోయ్ రెమ్యునరేషన్స్‌కే రూ. 100 కోట్లకు పైగా..!
ABN , Publish Date - Jul 10 , 2026 | 03:17 PM
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలను ఏవిధంగా పెరుగుతున్నాయో తెలియంది కాదు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic). ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలను ఏవిధంగా పెరుగుతున్నాయో తెలియంది కాదు. ‘కెజియఫ్’ చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యశ్ (Rocking Star Yash) హీరోగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి.. ఇప్పుడు ఒక నయా అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్ల వివరాలు బయటకు వచ్చి ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. కేవలం మెయిన్ ఆర్టిస్ట్‌ల రెమ్యునరేషన్స్ (Toxic Cast Remunerations) కోసమే మేకర్స్ ఏకంగా రూ. 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎపిక్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్న కన్నడ సూపర్ స్టార్ యశ్, ఈ చిత్రానికి నటుడిగానే కాకుండా ‘మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్’ బ్యానర్‌పై కో-ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఇందులో నటనకు గాను ఆయన రూ. 50 కోట్ల భారీ పారితోషికాన్ని అందుకోనున్నట్లు టాక్. దీనితో పాటు సినిమా లాభాల్లో కూడా ఆయనకు భారీ వాటా ఉండబోతోందట. ఇక ఈ చిత్రంలో నటిస్తున్న క్రేజీ హీరోయిన్ల రెమ్యునరేషన్లు కూడా హాట్ టాపిక్‌గా మారాయి.
బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) ఈ చిత్రంలో ‘నాడియా’ అనే కీలక పాత్రలో నటిస్తూ, తన కెరీర్‌లోనే అత్యధికంగా రూ. 15 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) సైతం తక్కువేమీ కాదంటూ రూ. 12 కోట్ల రెమ్యునరేషన్‌తో ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. వీరితో పాటు బాలీవుడ్ భామ తారా సుతారియా, కన్నడ సెన్సేషన్ రుక్మిణి వసంత్ చెరో రూ. 3 కోట్లు అందుకుంటుండగా, వర్సటైల్ యాక్ట్రెస్ హుమా ఖురేషీ రూ. 2 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట.
డైరెక్టర్ గీతూ మోహన్ దాస్, ఇతర కీలక సాంకేతిక నిపుణులు, మిగిలిన నటీనటుల ఖర్చులన్నీ కలుపుకుంటే మరో రూ. 100 కోట్ల మార్కును బీట్ చేసే ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ దృశ్య కావ్యం, ప్రేక్షకుల ముందుకు రావడానికి ముందే రికార్డుల వేట మొదలుపెట్టింది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే వెండితెరపై మరో విజువల్ వండర్ ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ క్రేజీ చిత్రం 26 ఆగస్ట్, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది.
ఇవి కూడా చదవండి:
మోక్షజ్ఞ ఎంట్రీ.. రంగంలోకి సందీప్ రెడ్డి వంగా?
Lenin Movie Review: లెనిన్ మూవీ రివ్యూ
I, Nobody: పృథ్వీరాజ్ సుకుమారన్... ఐ, నోబడీ మూవీ రివ్యూ