సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మమ్ముట్టి, మోహన్‌లాల్ ఎక్స్‌క్లూజివ్ చాట్ షో.. ఫ్యాన్స్‌కు పండగే!

ABN, Publish Date - Apr 18 , 2026 | 08:11 PM

సుదీర్ఘ విరామం తర్వాత లెజెండ్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘పేట్రియాట్’. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఈ ఇద్దరు స్టార్స్ కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు.

Patriot movie promotion

మలయాళ చిత్రసీమలోని ఇద్దరు దిగ్గజాలు, సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఫ్యాన్స్‌కు పండగే. వీరిద్దరూ ఇప్పటి వరకు ఎన్నో సమావేశాల్లో, సినిమాలలో కలిసి కనిపించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఈ స్టార్ ఇద్దరూ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘పేట్రియాట్’. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఈ ఇద్దరు స్టార్స్ కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ఇన్నాళ్లూ తమదైన నటనతో అలరించిన ఈ ఇద్దరు లెజెండ్స్, ఇప్పుడు ఒకే వేదికపై సరదాగా ముచ్చటించుకుంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి సిద్ధమయ్యారు.


ఈ స్పెషల్ షోకు ‘పేట్రియాట్ లెజెండ్స్ హ్యాంగౌట్’ (Patriot: Legends Hangout) అని పేరు పెట్టారు. ఇది కేవలం సినిమా ప్రమోషన్ మాత్రమే కాదు, ఒక ఎక్స్‌క్లూజివ్ చాట్ షోగా రూపొందించారు. ఈ షో ఏప్రిల్ 23 నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్‌స్టార్’ (JioHotstar)లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటి వరకు తెరపై వీరిద్దరి నటనను చూసి మురిసిపోయిన అభిమానులకు, వీరి మధ్య జరిగే నిజమైన సంభాషణలను, వ్యక్తిగత విశేషాలను వినే అరుదైన అవకాశం ఈ షో ద్వారా దక్కనుంది. అంతేకాదు, ప్రమోషన్స్‌ కోసం ప్రతిసారి భారీ ఈవెంట్స్‌ నిర్వహించకుండా, ముఖ్యంగా సీనియర్ హీరోలు ఇలాంటి చాట్ షో ద్వారా మూవీ ప్రమోషన్స్ నిర్వహించవచ్చని నిరూపించబోతున్నారు. నిజంగా ఇది సీనియర్ హీరోలకు ఒక మార్గంగా మారే అవకాశం లేకపోలేదు.


ప్రస్తుతం ఈ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీరిద్దరి కెమిస్ట్రీని చూడాలని సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా ముచ్చట్లు మాత్రమే కాకుండా, లెజెండ్స్ మధ్య జరిగే ఈ ‘హ్యాంగౌట్’లో ఇంకెన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయో తెలియాలంటే మాత్రం, ఏప్రిల్ 23 వరకు వేచి చూడాల్సిందే. మొత్తానికి ఈ షో కేవలం మలయాళీలే కాకుండా, అన్ని భాషల సినీ అభిమానులకు ఒక మర్చిపోలేని అనుభూతిని అందిస్తుందని భావించవచ్చు. చూద్దాం.. ఈ ఇద్దరు లెజెండ్స్ షో ని ఎలా రక్తికట్టిస్తారో?

ఇవి కూడా చదవండి:

పెళ్లికి సిద్ధమైన శృతిహాసన్.. ఆ లక్కీ వరుడు ఎవరో?

విష్ణుప్రియ దారిలోనే మరికొందరు.. ఆ కంటెంట్ కావాలంటే సబ్‌స్క్రైబ్ అవ్వాల్సిందే.

మంగ్లీ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్.. అసలు కథ ఇప్పుడే మొదలైంది!

Updated Date - Apr 18 , 2026 | 08:11 PM