Mammootty: మళ్లీ పాదయాత్ర అంటున్న మమ్ముట్టి..

ABN , Publish Date - Jan 23 , 2026 | 02:10 PM

'కాలం కావ‌ల్' (Kalamkaval) సినిమాతో ప్రేక్షకుల్ని అలరించి, చక్కని విజయాన్ని అందుకున్నారు మలయాళ మెగాస్టార్  మమ్ముట్టి . తాజాగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు.

'కాలం కావ‌ల్' (Kalamkaval) సినిమాతో ప్రేక్షకుల్ని అలరించి, చక్కని విజయాన్ని అందుకున్నారు మలయాళ మెగాస్టార్  మమ్ముట్టి. తాజాగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఇప్పటికే ఆయన చేతిలో ఆరు చిత్రాలు ఉన్నాయి. అందులో రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధం కాగా, మరో నాలుగు చిత్రాలు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. అందులోని ఓ చిత్ర‌మే  ఇది. ఈ సినిమాకు 'పాద‌యాత్ర' (Padayatra) అనే టైటిల్ ఖ‌రారు చేయ‌గా లెజెండరీ డైరెక్ట‌ర్ ఆదుర్ గోపాల కృష్ణన్  ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను హీరో మమ్ముట్టి  త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా విడుద‌ల చేశారు.


అయితే గ‌తంలో తెలుగులో వై.ఎస్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి స్టోరీతో వ‌చ్చిన‌ 'యాత్ర'లో ఆయన లీడ్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు ఈ సినిమాపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఇది  తెలుగు సినిమానా, జ‌గ‌న్‌కు సంబంధించి మరో సినిమా ఏదైనా వస్తుందా అని చర్చ మొదలైంది. అయితే ఈ సినిమాకు, తెలుగుకు సంబంధం లేదు. ఫ‌క్తు మ‌ల‌యాళ మార్కు సినిమా ఇది.  స్వ‌యంగా మ‌మ్ముట్టి ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం.

Updated Date - Jan 23 , 2026 | 03:17 PM