Mammootty: సోషల్ మీడియా వేదికగా క్షమాపణ

ABN , First Publish Date - 2022-12-15T17:58:27+05:30 IST

మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లకు క్షమాపణ?ని చెప్పారు. పొరపాటు తను చేసిన తప్పును తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కేరళలో 2018లో వచ్చిన వరదల నేపధ్యంలో ‘2018’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది.

Mammootty: సోషల్ మీడియా వేదికగా క్షమాపణ

మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి (Mammootty)సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లకు క్షమాపణ చెప్పారు. పొరపాటు తను చేసిన తప్పును తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కేరళలో 2018లో (2018 movie)వచ్చిన వరదల నేపధ్యంలో ‘2018’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి జూడో ఆంథనీ జోసెఫ్‌ (Jude Anthany Joseph)దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల టీజర్‌ను విడుదల చేశారు. మమ్ముటి దర్శకుడిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు తప్పుపట్టారు. టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో దర్శకుడు హెయిర్‌ స్టైల్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో మమ్ముటీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్ముట్టి మాట్లాడుతూ ‘‘జూడ్‌ ఆంథోనీ తలపై వెంట్రుకలు లేకపోయినా, అసాధారణమైన మెదడు కలిగిన అత్యుత్తమ ప్రతిభావంతుడు’’ అని పొగిడారు. దర్శకుడిరి బట్టతళ వ్యక్తి అంటూ అవమానించారని నెటిజన్లు భావించి. ఇలా మాట్లాడడం బాడీ షేమింగ్‌తో సమానమేనంటూ నెట్టింట మమ్ముటీని ట్రోల్‌ చేశారు. దీనిపై మమ్ముట్టి క్షమాపణలు చెబుతూ.. సోషల్ మీడియలో పోస్ట్‌ పెట్టారు. ‘డియర్‌ ఆల్‌... దర్శకుని ప్రశంసించేందుకు నేను ఉపయోగించిన కొన్ని పదాలు మిమ్మల్ని బాధపెట్టాయని తెలిసింది. ఉత్సాహంతో అలాంటి మాటలు మాట్లాడినందుకు క్షమించండి. మరోసారి అలా జరగదు. ఈ తప్పును గుర్తుచేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చారు. మమ్ముట్టి చేసిన పొరపాటు అంగీకరించి క్షమాపణ చెప్పినందుకు ఇప్పుడు మమ్ముట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

Updated Date - 2022-12-15T18:04:01+05:30 IST