Mammootty – Mohanlal: మాలీవుడ్ సినీ చరిత్రకు మరో అధ్యాయం..

ABN , Publish Date - Jan 05 , 2026 | 08:50 PM

మలయాళ సినిమా ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మూవీ 'పేట్రియాట్ (Patriot)'. మాలీవుడ్ స్టార్స్ మమ్ముట్టి (Mammootty) - మోహన్‌లాల్ (Mohan Lal) రీ-యూనియన్‌తో వస్తున్న ఈ చిత్రానికి మహేష్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Mammootty – Mohanlal

Mammootty – Mohanlal: మలయాళ సినిమా ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మూవీ 'పేట్రియాట్ (Patriot)'. మాలీవుడ్ స్టార్స్ మమ్ముట్టి (Mammootty) - మోహన్‌లాల్ (Mohan Lal) రీ-యూనియన్‌తో వస్తున్న ఈ చిత్రానికి మహేష్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాలీవుడు స్టార్ హీరోలిద్దరూ ఒకే సినిమాలో కనిపిస్తుండడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. వీరితో పాటు ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, నయనతార, కుంచాకో బోబన్, దర్శన రాజేంద్రన్, రేవతి వంటి వారు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఎట్టకేలకు 'పేట్రియాట్' సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకుంది. సంవత్సరం పైగా సాగిన నిర్మాణంలో మమ్ముట్టి ఆరోగ్య సమస్యల వల్ల కొంత ఆలస్యం జరిగింది. యూకే, శ్రీలంక, న్యూఢిల్లీ, హైదరాబాద్, కాశ్మీర్, కొచ్చి వంటి వివిధ ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. 130 రోజుల పాటు సాగిన షూటింగ్ పూర్తయిన సందర్భంగా మేకర్స్ బీటిఎస్ వీడియోను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక మలయాళ ఇండస్ట్రీ మొత్తం దేవుళ్ళుగా కొలిచే ఈ ఇద్దరు హీరోలు చాలా గ్యాప్ తరువాత అభిమానుల ముందుకు రాబోతున్నారు. ఆంటో జోసెఫ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌లో వేసవి సీజన్‌లో థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో మమ్ముట్టి, మోహన్ లాల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Updated Date - Jan 05 , 2026 | 08:53 PM