ఓటీటీలో దూసుకెళుతోన్న యాటిట్యూడ్ స్టార్ మూవీ!
ABN , Publish Date - May 09 , 2026 | 10:27 PM
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందననే రాబట్టుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో టాప్‌లో ట్రెండ్ అవుతున్నందుకు మేకర్స్ తమ సంతోషాన్ని తెలియజేశారు.
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ (Attitude Star Chandrahass) నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ (Barabar Premistha) ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందననే రాబట్టుకుంది. సంపత్ రుద్ర దర్శకత్వంతో వచ్చిన ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. అర్జున్ మహీ (‘ఇష్టంగా’ ఫేమ్) విలన్‌గా నటించిన ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్స్‌పై గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ నిర్మించారు. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకెళుతోంది.
అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ ‘బరాబర్ ప్రేమిస్తా’.. ఓటీటీ వీక్షకుల నుంచి మంచి ఆదరణను రాబట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో టాప్ పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతుండటం విశేషం. చంద్రహాస్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ఓటీటీ వీక్షకులని మెప్పిస్తోంది. మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ వంటి వారు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆర్ఆర్ ద్రువన్ సంగీతం అందించారు.
ఒక ఊరికి చెందిన చందు, బుజ్జమ్మల ప్రేమకు కులం, ఆస్తులు, అంతస్తులు కాకుండా.. అదే ఊరిలోని కొన్ని గొడవలు అడ్డంకిగా మారతాయి. ఆ గొడవలు ఏంటి? వాటిని ఈ ప్రేమ జంట ఎలా ఎదుర్కొంది? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో మంచి ఆదరణ పొందుతున్నందుకు మేకర్స్ తమ సంతోషాన్ని తెలియజేశారు.
ఇవి కూడా చదవండి:
Raghava Theater: ఈ థియేటర్‌లో ఫస్ట్, లాస్ట్ సినిమా ఎన్టీఆర్‌దే.. భావోద్వేగంలో ఫ్యాన్స్!
త్రిష లేకుంటే విజయ్ జాతకం మరోలా ఉండేది- వేణు స్వామి
Ranabaali: హార్స్ రైడింగ్ గ్లింప్స్.. విజయ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్!
Rao Bahadur: ‘పెద్ది’తో పోటీకి మహేష్ బాబు ‘నో’.. రిలీజ్ డేట్ మారింది!